Site icon NTV Telugu

Tejashwi Yadav: మోడీ-నితీష్ పాలనలో బీహార్ తాలిబాన్‌లా మారింది..

Tejashwi Yadav

Tejashwi Yadav

Tejashwi Yadav: ఎన్నికల ముందు బీహార్ రాష్ట్రంలో పెరుగుతున్న హింసపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పరాస్ ఆస్పత్రి కాల్పులు, వ్యాపారవేత్త హత్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ముందు జరుగుతున్న హత్యలపై బీజేపీ-జేడీయూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం నిస్సహాయంగా ఉందని అన్నారు. ‘‘బీహార్‌ని బీజేపీ తాలిబాన్‌గా మార్చింది’’ అని ఆరోపించారు.

Read Also: Liquor Scam Case: క్లైమాక్స్‌కి చేరిన లిక్కర్ స్కాం కేసు.. విచారణలో కీలక విషయాలు..

‘‘బీజేపీ బీహార్ ను తాలిబాన్ గా మార్చింది! గయలో డాక్టర్ కాల్పులు. పాట్నాలో రెండు గ్రూపుల మధ్య బహిరంగ కాల్పులు. పాట్నాలో మహిళ కాల్పులు. రోహ్తాస్‌లో వ్యాపారవేత్త హత్య.’’ అంటూ ఎక్స్‌లో తేజస్వీ యాదవ్ ఒక పోస్ట్ పెట్టారు. బీహార్‌లో శాంతిభద్రతల పరిస్థితి దిగజారడానికి ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కారణమని ఆరోపించారు.

బీహార్‌లో కొన్ని వారాలుగా జరుగుతున్న ముఠా హత్యలు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. ఐదుగురు గుర్తుతెలియని దుండగులు పాట్నాలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలోకి చొరబడి, పెరోల్‌పై వచ్చిన ఖైదీని కాల్చి చంపారు. ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ శనివారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి ఒక రిటైర్డ్ ఉద్యోగిని కాల్చి వెళ్లిన ఘటనను ప్రస్తావించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని ప్రస్తావించారు. రోహ్తాస్‌ జిల్లాలో 24 గంటల్లో రెండు హత్యలు జరిగినట్లు తెలిపారు.

Exit mobile version