Site icon NTV Telugu

Tejashwi Yadav: మహిళలకు తేజస్వి యాదవ్ మరో ఎన్నికల హామీ

Tejashwi Yadav

Tejashwi Yadav

బీహార్ ఎన్నికల వేళ మహిళ ఓటర్లే లక్ష్యంగా మహాఘట్‌బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ మరో ఎన్నికల హామీ కురిపించారు. ఎల్పీజీ సిలిండర్‌ను రూ.500కే ఇస్తామని హామీ ఇచ్చారు. శుక్రవారం సిమ్రీ భక్తియార్‌పూర్‌లో తేజస్వి యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సందర్భంగా మాట్లాడుతూ.. తమ ప్రభుత్వ అధికారంలోకి రాగానే ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.500కు తగ్గిస్తుందని.. అలాగే వృద్ధాప్య పెన్షన్‌ను రూ.1,500కు పెంచుతుందని హామీ ఇచ్చారు. అంతేకాకుండా బీహార్ ప్రజలకు విద్య, వైద్యం, ఉద్యోగాలు కల్పిస్తుందని, ప్రజల సమస్యలను మా ప్రభుత్వం వింటుందని తేజస్వి యాదవ్ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: PM Modi: విపక్ష కూటమిలో ఉన్నవారంతా నేరస్థులే.. బీహార్ ర్యాలీలో మోడీ ధ్వజం

బీహార్‌లో అవినీతిపరులైన నాయకులను, నేరస్థులను కేంద్రం కాపాడుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష కూటమి అధికారంలోకి వస్తే తాను స్వచ్ఛమైన ప్రభుత్వాన్ని అందిస్తానని తెలిపారు. ప్రజల ఫిర్యాదులను వినే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, వారికి అందుబాటు ధరల్లో మందులు, ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: PM Modi: భారతరత్న కర్పూరి ఠాకూర్‌కు నివాళులర్పించి బీహార్‌లో మోడీ ప్రచారం ప్రారంభం

‘జంగల్ రాజ్’పై మోడీ చేసిన ఆరోపణలకు స్పందిస్తూ.. ‘‘నితీష్ కుమార్ ప్రభుత్వం చేసిన 55 కుంభకోణాలను ప్రధానమంత్రి మోడీ స్వయంగా వివరించారు. ఆయన ఏ చర్య తీసుకున్నారు? ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు భారతదేశంలో అత్యధిక నేరపూరిత కార్యకలాపాలకు సాక్ష్యంగా ఉన్నాయని ఆరోపించారు.

‘‘నేను అర్ధ సత్యాలు, అబద్ధాలు చెప్పను. నేను చేసేదే చెబుతానని మీ అందరికీ తెలుసు. ఇండియా కూటమి ఎన్నికల్లో గెలిస్తే.. తేజస్వి యాదవ్ ప్రజల ముఖ్యమంత్రి అవుతారు. నేరాలు జరగకుండా చూస్తాను. బీహార్‌లో అవినీతి రహిత ప్రభుత్వాన్ని అందిస్తాను. మా ప్రభుత్వం బీహార్ ప్రజలకు విద్య, మందులు, ఉద్యోగాలను ఇస్తుంది. మా ప్రభుత్వం ప్రజల ఫిర్యాదులను వింటుంది.’’ అని తేజస్వి యాదవ్ అన్నారు.

తేజస్వి యాదవ్ ఇప్పటికే అనేక హామీలు కుమ్మరించారు. ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే జీవికా దీదీలను పర్మినెంట్ చేసి.. ప్రతి నెల రూ.30,000 వేల జీతం ఇస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ప్రత్యేక రుణాలు కూడా ఇస్తామని భరోసా ఇచ్చారు.

విపక్ష కూటమిలో నెలకొన్న రాజకీయ సంక్షోభం సమిసిపోయింది. గురువారం మహాఘట్‌బంధన్ ముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్‌ను ఇండియా కూటమి ప్రకటించింది. దీంతో కూటమిలో నెలకొన్న విభేదాలు పోయి.. అంతా ఐక్యంగా ఉన్నట్లు సందేశం ఇచ్చారు.

Exit mobile version