Site icon NTV Telugu

Bihar: లూలూ కుటుంబంలో మళ్లీ బలపడుతున్న రక్తసంబంధం.. తండ్రిని కలిసిన తేజ్ ప్రతాప్

Bihar

Bihar

బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. తర్వాత లాలూ కుటుంబంలో విభేదాలు రచ్చకెక్కాయి. ఎన్నికలకు ముందు ఆర్జేడీ నుంచి లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్‌ను బహిష్కరించారు. ఇక ఎన్నికల్లో ఆర్జేడీ ఓటమి తర్వాత కుటుంబంలో విభేదాలు నానా రచ్చ చేశాయి. ఘర్షణ కారణంగా సోదరీమణులు-సోదరులు విడిపోయారు. తాజాగా ఆ బంధాలు మరోసారి చిగురిస్తున్నట్లుగా కనిపిస్తోంది.

ఇది కూడా చదవండి: Ravi Shankar Prasad: కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇంట్లో అగ్నిప్రమాదం

మకర సంక్రాంతిని పురస్కరించుకుని తేజ్ ప్రతాప్ విందు ఏర్పాటు చేశాడు. ఈ విందుకు తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్‌ను, తల్లి రబ్రీ దేవిని ఆహ్వానించారు. అనంతరం తమ్ముడు తేజస్వి యాదవ్‌కు ఆహ్వాన పత్రిక అందజేశాడు. ముందుగా తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఆహ్వాన పత్రికలు అందజేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దహీ-చురా విందుకు తల్లిదండ్రులను, సోదరుడిని ఆహ్వానించినట్లు తేజ్ ప్రతాప్ పేర్కొన్నారు. ఈ విందు జనవరి 14న మకర సంక్రాంతి సందర్భంగా నిర్వహించబడుతోంది.

ఇది కూడా చదవండి: Thailand: థాయ్‌లాండ్‌లో ఘోర విషాదం.. ట్రైన్‌పై క్రేన్ పడి 22 మంది మృతి

చాలా కాలం తర్వాత లాలూ ప్రసాద్ కుటుంబాన్ని పాట్నాలో తేజ్ ప్రతాప్ కలిశారు. బహిష్కరణ తర్వాత రక్తసంబంధికులను కలవడం ఇదే తొలిసారి. ‘ఈరోజు నేను నా తండ్రిని లాలూ ప్రసాద్ యాదవ్‌ను, తల్లిని గౌరవించాను. రబ్రీ దేవి జీని 10 సర్క్యులర్ రోడ్‌లోని నివాసంలో కలిశాను. వారి ఆశీర్వాదం తీసుకున్నాను. అలాగే నా తమ్ముడు, బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు తేజస్విని కలిశాను. ‘దహి-చురా భోజ్’ కోసం ఆహ్వానించాను.’’ అని ఎక్స్‌లో తేజ్ ప్రతాప్ పోస్ట్ చేశారు. తాజా ఫొటోలను బట్టి మళ్లీ సంబంధం మెరుగుపడుతున్నట్లుగా కనిపిస్తోంది. తేజ్ ప్రతాప్ ఆర్జేడీ నుంచి బహిష్కరించిన తర్వాత సొంత పార్టీ ‘జనశక్తి జనతాదళ్’ను స్థాపించారు.

ఇక మంగళవారం బీజేపీ సీనియర్ నాయకుడు, బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా ఏర్పాటు చేసిన విందుకు తేజ్ ప్రతాప్ హాజరయ్యారు. మకర సంక్రాంతి సందర్భంగా జరిగిన ఈ విందుకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్, డిప్యూటీ సిఎం సామ్రాట్ చౌదరి, జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ కుమార్ ఝా, హిందూస్థానీ అవామ్ మోర్చా చీఫ్ సంతోష్ కుమార్ సుమన్ హాజరయ్యారు.

 

Exit mobile version