Bihar: లాలూ కుటుంబంలో మళ్లీ బలపడుతున్న రక్తసంబంధం.. తండ్రిని కలిసిన తేజ్ ప్రతాప్
- లాలూ కుటుంబంలో మళ్లీ బలపడుతున్న రక్తసంబంధం
- తల్లిదండ్రులు, సోదరుడిని కలిసిన తేజ్ ప్రతాప్
- దహీ-చురా విందుకు ఆహ్వానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. తర్వాత లాలూ కుటుంబంలో విభేదాలు రచ్చకెక్కాయి. ఎన్నికలకు ముందు ఆర్జేడీ నుంచి లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్‌ను బహిష్కరించారు. ఇక ఎన్నికల్లో ఆర్జేడీ ఓటమి తర్వాత కుటుంబంలో విభేదాలు నానా రచ్చ చేశాయి. ఘర్షణ కారణంగా సోదరీమణులు-సోదరులు విడిపోయారు. తాజాగా ఆ బంధాలు మరోసారి చిగురిస్తున్నట్లుగా కనిపిస్తోంది.
ఇది కూడా చదవండి: Ravi Shankar Prasad: కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇంట్లో అగ్నిప్రమాదం
Also Read
- Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
- Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
మకర సంక్రాంతిని పురస్కరించుకుని తేజ్ ప్రతాప్ విందు ఏర్పాటు చేశాడు. ఈ విందుకు తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్‌ను, తల్లి రబ్రీ దేవిని ఆహ్వానించారు. అనంతరం తమ్ముడు తేజస్వి యాదవ్‌కు ఆహ్వాన పత్రిక అందజేశాడు. ముందుగా తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఆహ్వాన పత్రికలు అందజేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దహీ-చురా విందుకు తల్లిదండ్రులను, సోదరుడిని ఆహ్వానించినట్లు తేజ్ ప్రతాప్ పేర్కొన్నారు. ఈ విందు జనవరి 14న మకర సంక్రాంతి సందర్భంగా నిర్వహించబడుతోంది.
ఇది కూడా చదవండి: Thailand: థాయ్‌లాండ్‌లో ఘోర విషాదం.. ట్రైన్‌పై క్రేన్ పడి 22 మంది మృతి
చాలా కాలం తర్వాత లాలూ ప్రసాద్ కుటుంబాన్ని పాట్నాలో తేజ్ ప్రతాప్ కలిశారు. బహిష్కరణ తర్వాత రక్తసంబంధికులను కలవడం ఇదే తొలిసారి. ‘ఈరోజు నేను నా తండ్రిని లాలూ ప్రసాద్ యాదవ్‌ను, తల్లిని గౌరవించాను. రబ్రీ దేవి జీని 10 సర్క్యులర్ రోడ్‌లోని నివాసంలో కలిశాను. వారి ఆశీర్వాదం తీసుకున్నాను. అలాగే నా తమ్ముడు, బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు తేజస్విని కలిశాను. ‘దహి-చురా భోజ్’ కోసం ఆహ్వానించాను.’’ అని ఎక్స్‌లో తేజ్ ప్రతాప్ పోస్ట్ చేశారు. తాజా ఫొటోలను బట్టి మళ్లీ సంబంధం మెరుగుపడుతున్నట్లుగా కనిపిస్తోంది. తేజ్ ప్రతాప్ ఆర్జేడీ నుంచి బహిష్కరించిన తర్వాత సొంత పార్టీ ‘జనశక్తి జనతాదళ్’ను స్థాపించారు.
ఇక మంగళవారం బీజేపీ సీనియర్ నాయకుడు, బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా ఏర్పాటు చేసిన విందుకు తేజ్ ప్రతాప్ హాజరయ్యారు. మకర సంక్రాంతి సందర్భంగా జరిగిన ఈ విందుకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్, డిప్యూటీ సిఎం సామ్రాట్ చౌదరి, జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ కుమార్ ఝా, హిందూస్థానీ అవామ్ మోర్చా చీఫ్ సంతోష్ కుమార్ సుమన్ హాజరయ్యారు.
आज अपने पिताजी आदरणीय श्री लालू प्रसाद यादव जी, माता जी आदरणीय श्रीमती राबड़ी देवी जी से 10 सर्कुलर रोड स्थित आवास पहुंचकर मुलाकात कर आशीर्वाद प्राप्त किया और अपने छोटे भाई और बिहार विधानसभा में नेता प्रतिपक्ष तेजस्वी से भी भेंट मुलाकात कर कल 14 जनवरी को मकर संक्रांति के अवसर पर… pic.twitter.com/T2nZ5qz3x6
— Tej Pratap Yadav (@TejYadav14) January 13, 2026
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?