NTV Telugu Site icon

Borewell Incident: గుజరాత్‌లో బోరుబావిలో పడిన 18 ఏళ్ల యువతి..

Teen Falls Into Borewell In Gujarat

Teen Falls Into Borewell In Gujarat

Borewell Incident: రాజస్థాన్‌లో ఇటీవల బోరుబావిలో పడి మూడేళ్ల బాలిక చేతన మరణించడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బాలిక సురక్షితంగా తిరిగి రావాలని అంతా కోరుకున్నారు. 10 రోజుల రెస్క్యూ తర్వాత బాలిక చనిపోయింది. ఇదిలా ఉంటే, ఈ ఘటన మరవక ముందే మరో బోరుబావి సంఘటన చోటు చేసుకుంది.

Read Also: India On Pak: అమాయకులపైన ఏంట్రా మీ ప్రతాపం..ఆఫ్ఘన్‌పై పాక్ దాడిని ఖండించిన భారత్..

గుజరాత్ కచ్ జిల్లాలోని గ్రామంలో సోమవారం ఉదయం 18 ఏళ్ల యువతి 540 అడుగుల లోతున్న బోరుబావిలో పడిపోయింది. యువతి 490 అడుగులలో కూరుకుపోయిందని భుజ్ డిప్యూటీ కలెక్టర్ ఏబీ జాదవ్ తెలిపారు. ఆమెని రక్షించేందుక అన్ని ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెప్పారు. ఈ ఘటన కచ్ జిల్లా భుజ్ తాలూకాలోని కండెరాయ్ గ్రామంలో జరిగింది. ఉదయం 6:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

18 ఏళ్ల యువతి బోరుబావిలో పడటం ముందుగా అధికారులకు షాక్‌కి గురిచేసింది. కెమెరాలు ఉపయోగించిన తర్వాత బోర్‌వెల్‌లో యువతి ఉన్నట్లు నిర్ధారించారు. అమ్మాయి అపస్మారస్థితిలో ఉందని, స్థానిక రెస్క్యూ టీమ్ ఆమెకు ఆక్సిజన్ సరఫరా చేస్తోందని, ఆమెని బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్డీఆర్ఎప్, బీఎస్ఎఫ్ బలగాలు కూడా సహాయ చర్యల్ని ప్రారంభించాయి.

Show comments