Tecno Spark 9: బడ్జెట్ ధరలో మరో కొత్త ఫోన్.. ఫీచర్స్‌కి ఫిదా అవ్వాల్సిందే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tecno Spark 9 Smartphone Launched With 11GB Ram: స్మార్ట్‌ఫోన్ల వినియోగం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్లదే హవా నడుస్తుండటంతో, కంపెనీల మధ్య పోటీ తీవ్రంగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే వినియోగదారుల్ని ఆకట్టుకునేందుకు అధునాతన ఫీచర్స్‌తో తక్కువ ధరల్లోనే స్మార్ట్‌ఫోన్స్‌ని లాంచ్ చేస్తున్నాయి. ఇప్పుడు తాజాగా టెక్నో కంపెనీ బడ్జెట్ రేంజ్‌లో ఓ కొత్త మోడల్‌ని సోమవారం లాంచ్ చేసింది. రూ. 10 వేలలోపు ధరతో వచ్చిన ఈ ఫోన్‌లోని ఫీచర్స్ చూస్తే.. ఎవ్వరైనా అవాక్కవ్వాల్సిందే!
టెక్నో స్పార్క్ 9 (Tecno Spark 9) పేరుతో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్ 128జీబీ స్టోరేజ్‌ను కలిగి ఉంది. 6జీబీ ఫిజికల్ ర్యామ్, 5జీబీ వర్చువల్ ర్యామ్ కలిపి.. మొత్తంగా 11జీబీ వరకు ర్యామ్ ఈ ఫోన్‌లో ఉంటుంది. 90Hz రిఫ్రెష్ రేట్ ఉండే 6.6 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే, మీడియాటెక్ హీలియో ప్రాసెసర్‌తో వస్తోన్న ఈ మొబైల్ ధర కేవలం రూ. 9,499గా ఉంది. ఇన్ఫినిటీ బ్లాక్, స్కై మిర్రర్ కలర్స్‌లో ఈ Tecno Spark 9 స్మార్ట్‌ఫోన్ లభిస్తుంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఇది రన్ అవుతుంది. ఓటీఏ (OTA) అప్‌డేట్ చేసుకున్న తర్వాత ఈ ఫోన్‌లోని వర్చువల్ ర్యామ్ ఫీచర్ వస్తుందని టెక్నో సంస్థ పేర్కొంది.
Also Read
ఈ మొబైల్ వెనుక భాగంలో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, మరో లెన్స్ ఉన్నాయి. ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ లెన్స్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా కోసం ముందుభాగంలో వాటర్ డ్రాప్ నాచ్ ఉంది. 5000mAh బ్యాటరీతో వస్తోన్న ఈ ఫోన్.. స్టాండర్డ్ 10వాట్ల చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. డీటీఎస్ సపోర్ట్ చేసే స్పీకర్‌ను కూడా ఈ మొబైల్ కలిగి ఉండటం విశేషం.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!