Site icon NTV Telugu

AMU: ప్రధాని మోడీ, సీఎం యోగిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు.. టీచర్ అరెస్ట్..

Amu

Amu

AMU: ప్రధానమంత్రి నరేంద్రమోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌‌పై ‘‘అసభ్యకరమై వ్యాఖ్యలు’’ చేసిన అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ(AMU) గెస్ట్ లెక్చరర్‌ని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. జనవరి 11 రాత్రి అతడికి, ఏఎంయూ భద్రతా సిబ్బందికి మధ్య జరిగిన ఘర్షణలో ఈ వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొనబడింది. ఈ సంఘటనపై ఏఎంయూ అధికారులు సంస్కృత విభాగంలో గెస్ట్ లెక్చరర్‌గా పనిచేస్తున్న అరిమందన్ సింగ్ పాల్‌కి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

Read Also: Hamas-Israel: రేపు మరో ముగ్గురు బందీలను విడుదల చేస్తున్నట్లు హమాస్ ప్రకటన

ప్రాథమిక దర్యాప్తు తర్వాత పాల్‌ తాత్కాలికంగా రిలీవ్ అయ్యారని ఏఎంయూ ప్రతినిధి ప్రొఫెసర్ విభా శర్మ శుక్రవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. స్థానిక కాంగ్రెస్ యూత్ లీడర్ రాజా భయ్యా, పాల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సివిల్ లైన్స్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సంఘటన జరిగిన రోజు, గొడవను చూసిన విద్యార్థులు పాల్‌ని నెహ్రూ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి వైద్యపరీక్షల కోసం తీసుకెళ్లాని ప్రయత్నించారు. అతను తాగి ఉన్నాడో లేదో అని పరీక్షించడానికి ప్రయత్నించిన సందర్భంలో పాల్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రధాని, సీఎం, యూనివర్సిటీ అధికారులపై అసభ్యకరమైన భాష ఉపయోగించడంపై అతడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Exit mobile version