TCS Nashik Case: ఐటీ ఇండస్ట్రీలో సంచలనంగా టీసీఎస్ నాసిక్ ‘‘కార్పొరేట్ జిహాద్’’ కేసు.. మహిళా భద్రతపై డౌట్స్..
- ఐటీ ఇండస్ట్రీలో సంచలనంగా టీసీఎస్ నాసిక్ కేసు..
- కార్పొరేట్ జిహాద్ ఆరోపణలతో కలకలం..
- ఏడుగురు నిందితుల అరెస్ట్, పరారీలో హెచ్ఆర్..
- పని ప్రదేశాల్లో మహిళా భద్రతపై అనుమానాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TCS Nashik Case: ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్ నాసిక్ బీపీవోలో జరిగిన ‘‘కార్పొరేట్ జిహాద్’’ కేసు దేశవ్యాప్తంగా ఐటీ పరిశ్రమలో పెద్ద కుదుపుకు కారణమైంది. బయటకు అద్దాల మేడలు, పోష్ లైఫ్ స్టైల్‌తో కళకళలాడే ఐటీ ఇండస్ట్రీ వెనక ఎంతటి అరాచకాలు జరుగుతున్నాయనే దానికి ఈ ఘటన అద్దం పడుతుంది. వర్క్ ప్లేసుల్లో మత వ్యవహారాలను తీసుకురావడం, బలవంతంగా ఒక కుట్ర ప్రకారం మతమార్పిడిలు చేపట్టడం, మహిళలపై లైంగిక వేధింపులు వంటివి వెలుగులోకి వచ్చాయి. ఉద్యోగుల భద్రత, ముఖ్యంగా మహిళల భద్రతకు కార్పొరేట్ పాలసీలు ఉన్నప్పటికీ, సీనియర్ ఉద్యోగులు, హెచ్ఆర్ సిబ్బంది మహిళా ఉద్యోగులు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం సమస్య తీవ్రతను తెలియజేస్తోంది.
ఏమిటి కేసు:
Also Read
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
ఈ కేసులో మహిళా ఉద్యోగులను టార్గెట్ చేసి, లైంగిక వేధింపులకు పాల్పడటం, మతపరమైన ఒత్తిడి వంతి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో డానిష్ షేక్, తౌసిఫ్ అత్తర్, రజా మెమన్, షారుఖ్ ఖురేషి, షఫీ షేక్, ఆసిఫ్ అఫ్తాబ్ అన్సారీలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక వీరికి సహకరించిన హెచ్ఆర్ మేనేజర్ నిదా ఖాన్ పరారీలో ఉండగా ఆమెను కూడా అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అరెస్టయిన నిందితులు టీమ్ లీడ్ వంటి పోస్టుల్లో ఉంటూ కింది ఉద్యోగులను ముఖ్యంగా హిందూ యువతుల్ని టార్గెట్ చేశారు.
హిందూ అమ్మాయిలను టార్గెట్ చేసి వారితో సన్నిహిత సంబంధాలు పెట్టుకోవడం, వారిని మతపరంగా అవమానించడం, తమ మతాన్ని అనుసరిస్తేనే సాలరీ హైక్స్, ఉద్యోగ భద్రత ఉంటుందని భయపెట్టడం వంటి వారికి నిందితులు పాల్పడ్డారు. నిదా ఖాన్ హిందూ మహిళలతో స్నేహం చేసి, వారిని క్రమంగా నమాజ్ చేయించడం, హిజాబ్ ధరించడం వంటిని నేర్పించేదని, ఎవరైనా ఈ వేధింపుల గురించి ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి.
కేసు ఎలా బయటకు వచ్చింది.?
2026 ఫిబ్రవరిలో నాసిక్ పోలీసులకు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ సాగింది. కంపెనీలో పనిచేసే యువతి కొన్ని రోజులకే తన మతాన్ని మార్చుకున్నట్లు కుటుంబీకులు గమనించారు. దీంతో మహిళా పోలీసులు కొన్ని రోజుల పాటు ఉద్యోగులుగా ఆ కంపెనీలో చేరి, అండర్ కవర్ ఆపరేషన్ చేసి ఆరోపణలు నిజమని తేల్చారు. దీనికి సంబంధించిన సాక్ష్యాలను సేకరించారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో మొత్తం 9 మంది ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో 8 మంది మహిళలు కాగా, ఒక పురుషుడు కూడా ఉన్నాడు.
నిందితులపై లైంగిక వేధింపులు, అత్యాచారం, మతపరమైన ఒత్తిడి వంటి కేసులు పెట్టారు. ఏసీసీ సందీప్ మిట్కే నేతృత్వంలో మహారాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. నిందితులకు సంబంధించిన ఈమెయిల్స్, కాల్ రికార్డులు, సీసీటీవీ ఫుటేజ్, చాట్ హిస్టరీని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ స్పందించారు. ఈ కేసును తీవ్రంగా తీసుకున్నామని, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కంపెనీ విచారణకు పూర్తిగా సహకరిస్తుందని వెల్లడించారు.
మహిళలకు భద్రత లేదా..?
మెరిసే అద్దాల మేడలు, ఆకర్షణీయమైన ఐటీ ఇండస్ట్రీ వెనక ఇలాంటి అరాచకాలు జరుగుతుండటం ఇప్పుడు సంచలనంగా మారింది. అత్యున్నత చదువులు చదువుకుని ఉద్యోగాలు చేసే ఇలాంటి వర్క్‌ప్లేస్‌లో కూడా మహిళలకు భద్రత కరువైంది. వారి బలహీనత, ఉద్యోగ అవసరాలను ఆసరాగా చేసుకుని కొందరు ‘‘కార్పొరేట్ జిహాద్’’కు పాల్పడుతున్నారు. అయితే, మహిళల భద్రత కోసం ‘‘సెక్చువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్ యాక్ట్ 2013’’ (POSH చట్టం) చట్టం ప్రకారం, పని ప్రదేశాల్లో ఇంటర్నల్ కమిటీ ఉండాలి, ఉద్యోగలుకు భద్రమైన వాతావరణ కల్పించాలి. ఫిర్యాదుల్ని తీసుకోవాలి.
కానీ నాసిక్ కేసులో ఇవేవీ పనిచేయలేదు. హెచ్ఆర్ విభాగంలో పనిచేసినా పట్టించుకోలేదు. మరో దారుణమైన విషయం ఏంటంటే.. కార్పొరేట్ వరల్డ్‌లో ఇదంతా కామన్ అంటూ హెచ్ ఆర్ విభాగం చెప్పడం మరింత విడ్డూరంగా ఉంది. ఇది ఒక్క నాసిక్ సంఘటన మాత్రమే కాదు. చాలా కంపెనీల్లో ఉన్నతస్థానాల్లో ఉన్న వారు మహిళా ఉద్యోగుల్ని మానసికంగా శారీరకంగా వేధిస్తున్నారు. ఇలాంటి వారిపై ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉంటూ, వేధింపులు జరగగానే పోలీసులకు ఫిర్యాదు చేయడం మంచింది.
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!