Tax officer Turned Actor Under Probe In 263 Crore Money Laundering Case: పాపం ఆ నటి.. గతంలో తాను చేసిన వృతి నచ్చకపోవడంతో, దాన్ని వదిలేసి రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టింది. తనదైన ముద్ర వేసి, ఓ వెలుగు వెలిగిపోవాలని కలలు కనింది. కానీ, ఇంతలోనే ఆమెకు ఊహించని షాక్ తగిలింది. ఒక వ్యక్తితో తాను పెట్టుకున్న రిలేషన్‌షిప్, ఆమెను ఒక పెద్ద కేసులో ఇరుక్కునేలా చేసింది. మనీలాండరింగ్ వ్యవహారంలో చిక్కులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో.. ఆ నటి పరిస్థితి ఇప్పుడు అయోమయంగా తయారైంది. తన కెరీర్‌పై ఈ కేసు ఎక్కడ ప్రభావం చూపుతుందోనని ఆందోళన చెందుతోంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Shocking: తన అంత్యక్రియలను తానే చేసుకున్న వృద్ధుడు
ఆ నటి పేరు కృతీ వర్మ. ఇంతకుముందు ట్యాక్స్ ఆఫీసర్‌గా పని చేసిన ఆమె.. సినిమాల మీదున్న ఇంట్రెస్ట్‌తో రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టింది. రోడీస్, బిగ్ బాస్ సీజన్ 12లో పాల్గొంది. ఇప్పుడు అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న కృతీ.. 263 మనీలాండరింగ్ కేసులో సమన్లు అందుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఓ వ్యక్తితో కృతీ రిలేషన్‌షిప్‌లో ఉండటం వల్లే ఈడీ అధికారుల నుంచి నోటీసులు వెళ్లాయి. కొన్ని డబ్బులు సైతం అందుకున్నట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఈడీ కృతీని పలుసార్లు ఈ కేసులో ప్రశ్నించింది. ట్యాక్స్ ఆఫీసర్‌గా చేసిన అనుభవం ఉంది కాబట్టి.. ఈ కేసులో ఈమె పాత్రపై అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విచారణకు తరచూ పిలుస్తున్నారు.
Turkey Earthquake: ఆ పాప ఓ అద్భుతం.. శిథిలాల కిందే జననం
కాగా.. గతేడాది రీఫండ్‌లను మోసపూరితంగా జారీ చేసిన కేసులో ఐటీ డిపార్ట్‌మెంట్‌కి చెందిన సీనియర్ ట్యాక్స్ అసిస్టెంట్, తానాజీ మండల్ అధికారి, పన్వేల్‌కి చెందిన వ్యాపారవేత్త భూషణ్ అనంత్ పాటిల్‌తో పాటు మరికొందరిపై సీబీఐ కేసు నమోదు చేసింది. 2007-08, 2008-09 అసెస్‌మెంట్ సంవత్సరాలకు సంబంధించి బూటకపు రీఫండ్‌ల జారీపై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా.. సీబీఐ ఈ కేసుని దర్యాప్తు చేస్తోంది. 2021లో తనకు ఈ ఫ్రాడ్‌లో భాగంగా వచ్చిన డబ్బులతో గురుగ్రామ్‌లో కృతీ వర్మ ఓ ప్రాపర్టీ కొనుగోలు చేసిందని, దాన్ని విక్రయించిన డబ్బులో ఆమె ఖాతాలో వచ్చినట్టు సీబీఐకి తెలిసింది. సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా ఆమె ఖాతాలో రూ.1.18 కోట్లను గుర్తించి, అకౌంట్‌ని ఫ్రీజ్ చేశారు.
INDvsAUS 1st Test: తొలిటెస్టులో టీమిండియా పైచేయి..వైరల్ అవుతున్న మీమ్స్
