తమిళనాడులో ప్రస్తుతం కరోనా కేసులు అదుపులోనే ఉన్నాయి. కేసులు తగ్గుముఖం పట్టడంతో ఆ రాష్ట్రంలో అన్ని రంగాలు తిరిగి తెరుచుకున్నాయి. అయితే, తమిళనాడు సరిహద్దు కలిగిన కేరళ రాష్ట్రంలో కేసులు భారీ స్థాయిలో నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ప్రతిరోజు ఆ రాష్ట్రంలో 20 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఐదు రోజుల కాలంలో లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో కేరళ నుంచి వచ్చే ప్రయాణికులపై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Read: జగన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం రోజురోజుకీ దివాలా తీస్తోంది…
కేరళ నుంచి తమిళనాడు వచ్చే ప్రయాణికులు ఎవరైనా సరే తప్పని సరిగా ఆర్టీపీసీఆర్ టెస్టుకు సంబందించి సర్టిఫికెట్ వెంట తెచ్చుకోవాలని సూచించింది. ఆగస్టు 5 నుంచి ఈ నిబంధనలు అమలులోకి వస్తాయని తమిళనాడు ప్రభుత్వం పేర్కొన్నది. ఒకవైపు వేగంగా వ్యాక్సిన్ అమలు చేస్తున్నప్పటికీ కేసులు పెరుగుతుండటంతో ఆ రాష్ట్రం ఆందోళన చెందుతున్నది. ఒకవేళ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి కాకుండానే మూడో వేవ్ ఎంటరైతే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ ఆందోళన చెందుతున్నది.
