తమిళనాడులో ఘోర విషాదం జరిగింది. విరూద్‌నగర్ జిల్లాలో బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. కుట్టనార్‌పట్టి గ్రామంలో జరిగిన ఈ దుర్ఘటనలో 17 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి 10 కిలోమీటర్ల వరకు ప్రకంపనలు వచ్చాయి. సంఘటనా స్థలంలో 5 ఫైర్ ఇంజన్లు మంటల్ని ఆర్పుతున్నాయి. భారీగా ఎగిసిపడుతున్న మంటల్ని ఆర్పడానికి అధికారులు కష్టపడుతున్నారు. పేలుడు ధాటికి భవనం కుప్పకూలింది. శిథిలాల కింద మృతదేహాలు చిక్కుకున్నాయి. క్షతగాత్రుల్ని తరలించేందుకు అంబులెన్సులను సిద్ధం చేశారు.
Tamil Nadu: తమిళనాడులో భారీ పేలుడు.. 17 మంది దుర్మరణం..
- తమిళనాడులో భారీ పేలుడు..
- బాణాసంచా ఫ్యాక్టరీ బ్లాస్ట్..
- 17 మంది మృతి, 9 మందికి గాయాలు..

Tamil Nadu