ముఖ్యమంత్రి హోదాలో విజయ్ తొలిసారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ముందు వరుసలో త్రిష ఆశీసునురాలైంది. ముఖ్యమంత్రి విజయ్ తల్లిదండ్రుల ప్రక్కనే కూర్చుని ఆద్యంతం ఉల్లాసంగా.. ఉత్సాహంగా కనిపించింది. మొబైల్‌లో ఫొటోలు తీస్తూ నవ్వుతూ కనిపించింది. ఇక పరేడ్ సమయంలో సీఎం విజయ్ త్రిషకు సెల్యూట్ చేయడం.. బదులుగా త్రిష కూడా విజయ్‌కు సెల్యూట్ చేసింది. ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయంగా రచ్చ రచ్చ చేస్తోంది. ఇ ద్దరూ పరస్పరం సెల్యూట్ చేసుకోవడంపై విపక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రధాన ప్రతిపక్షం డీఎంకే పత్రిక ‘మురసోలి’ దుమ్మెత్తిపోసింది. ఏం హోదా ఉందని త్రిషను ముందు వరుసలో కూర్చోబెట్టారని నిలదీసింది.
‘సిగ్గుచేటైన దృశ్యం’ అంటూ..
మురసోలి తన సంపాదకీయంలో ఈ ఘటనను ‘సిగ్గుచేటైన దృశ్యం’గా అభివర్ణించింది. అధికారిక కార్యక్రమంలో ఇలాంటి వ్యవహారం సముచితం కాదని పేర్కొంది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ముఖ్యమంత్రి విజయ్ హోదాకు ఉండాల్సిన గౌరవం గాలిలో కలిసిపోయిందని విమర్శించింది. ‘‘ఎలాంటి సిగ్గు, సంకోచం లేకుండా ఓ నటిని ముందు వరుసలో కూర్చోబెట్టి.. పదేపదే పరస్పరం సెల్యూట్ చేసుకోవడం కనిపించింది. విజయ్‌కు ఓటు వేసిన వారే ఈ దృశ్యాన్ని జీర్ణించుకోలేకపోయి ఉంటారు’’ అంటూ మురసోలి ఘాటు వ్యాఖ్యలు చేసింది.
విజయ్ తల్లిదండ్రుల పక్కన..
తమిళనాడు ప్రభుత్వం నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో త్రిష.. విజయ్ తల్లిదండ్రుల పక్కన కూర్చున్నారు. పసుపు రంగు చీరలో కనిపించిన ఆమె.. విజయ్ జాతీయ జెండాను ఎగురవేసిన సమయంలో సెల్యూట్ చేశారు. అనంతరం అధికారిక కార్యక్రమాలను విజయ్ పరిశీలిస్తున్న సమయంలోనూ ఆమె సెల్యూట్ చేస్తూ కనిపించారు.
ఇటీవల కాలంలో అధికారిక కార్యక్రమాల్లో త్రిష హాజరు కావడం చర్చనీయాంశంగా మారుతోంది. మే నెలలో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికి కూడా ఆమె హాజరయ్యారు. ఆ సమయంలో వేడుక జరుగుతుండగా త్రిష భావోద్వేగానికి గురైన దృశ్యాలు కూడా వైరల్ అయ్యాయి. విజయ్, త్రిష చాలా ఏళ్లుగా స్నేహితులుగా ఉన్నారు. అయితే వీరిద్దరి సాన్నిహిత్యంపై తరచూ సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో ఊహాగానాలు, ప్రచారం జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మురసోలి కూడా విజయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రచారాలను ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించింది.
ఇక త్రిషకు సంబంధించిన ఈ రాజకీయ విమర్శలు రావడానికి కొద్ది రోజుల ముందే డీఎంకే యువజన విభాగం నాయకుడు, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్.. విజయ్‌కు సంబంధించిన వ్యాఖ్యలపై విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ వివాదం కొనసాగుతున్న సమయంలోనే మురసోలి తాజా సంపాదకీయంలో విజయ్, త్రిష అంశాన్ని ప్రస్తావించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
విజయ్ ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ.. ఇలాంటి ‘సిగ్గుచేటైన, అసహ్యకరమైన ప్రవర్తనను’ బహిరంగంగా ప్రదర్శించడం ద్వారా సమర్థించేందుకు ప్రయత్నిస్తున్నారని మురసోలి ఆరోపించింది. అధికారిక కార్యక్రమంలో త్రిషతో విజయ్ వ్యవహరించిన తీరును ఆయన మద్దతుదారులు సైతం అంగీకరించడం కష్టమేనని డీఎంకే పత్రిక వ్యాఖ్యానించింది.

