Tamil Nadu: గవర్నర్‌ను కలిసిన విజయ్.. ఎమ్మెల్యేల మద్దతు లేఖ అందజేత
- గవర్నర్‌ను కలిసిన విజయ్
- ఎమ్మెల్యేల మద్దతు లేఖ అందజేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హమ్మయ్య.. ఎట్టకేలకు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌ను విజయ్ కలిశారు. దీంతో 120 ఎమ్మెల్యేల మద్దతు లేఖను గవర్నర్‌కు అందజేశారు. విజయ్ అందజేసిన మద్దతు లేఖలను గవర్నర్ పరిశీలిస్తున్నారు. పరిశీలన తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలా? వద్దా? అని తేల్చనున్నారు.
కొద్దిసేపటి క్రితమే వీసీకే, ముస్లిం లీగ్ పార్టీలు విజయ్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. దీంతో విజయ్ బలం 120కి చేరింది. ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. గత 6 రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠ తెర పడనుందా? లేదా? అన్నది మరికొద్దిసేపట్లో తేలిపోనుంది.
Also Read
- UP Elections: ‘‘అభ్యర్థి పేరు చెప్పండి.. సీటు తీసుకోండి’’.. కాంగ్రెస్‌కు ఎస్పీ కొత్త కండిషన్
- Smriti Irani: ‘‘కర్ణాటక, కేరళ, హిమాచల్‌లో గెలిచింది ఎలా?’’.. కాంగ్రెస్‌పై స్మృతి ఇరానీ ఫైర్
- Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..
- Student Protests: రేప్ నుంచి దెయ్యం వరకు.. పుకార్లతో రగిలిపోతున్న యూనివర్సిటీలు.!
సోమవారం వెలువడిన ఫలితాల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే మాత్రమే 108 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించింది. దీంతో విజయ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించవచ్చని అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా అంచనాలు తారుమారయ్యాయి. పూర్తి మ్యాజిక్ ఫిగర్‌తో వస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తానని విజయ్‌కు సూచించారు. దీంతో కాంగ్రెస్, వామపక్షాల మద్దతు ఇవ్వడంతో విజయ్ బలం 116కు చేరింది. అయితే మరో రెండు స్థానాలు ఉన్న వీసీకేకు చెందిన పార్టీ మద్దతు ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తగ్గింది. దీంతో మ్యాజిక్ ఫిగర్‌కు విజయ్ చేరుకోకపోవడంతో రాజకీయ అనిశ్చితి అలానే కొనసాగుతోంది. మొత్తానికి శనివారం వీసీకే సంపూర్ణ మద్దతు ప్రకటించింది. వీసీకేతో పాటు ముస్లిం లీగ్ పార్టీ కూడా మద్దతు తెలిపింది. దీంతో విజయ్ బలం 120కి చేరింది.
వాస్తవంగా ఈరోజు రాత్రి గవర్నర్ కేరళం వెళ్లేందుకు రెడీ అయ్యారు. దీంతో విజయ్‌కు తొలుత అపాయింట్ ఇవ్వలేదు. దీంతో లోక్‌భవన్‌కు వెళ్లి విజయ్ తిరిగి వచ్చేశారు. మొత్తానికి చివరి నిమిషంలో గవర్నర్ మనసు మార్చుకున్నారు. కేరళం టూర్ రద్దు చేసుకున్నారు. దీంతో విజయ్‌కు సాయంత్రం 6:30 గంటలకు అపాయింట్‌మెంట్ ఇచ్చారు.
తాజావార్తలు
-
UP Elections: ‘‘అభ్యర్థి పేరు చెప్పండి.. సీటు తీసుకోండి’’.. కాంగ్రెస్‌కు ఎస్పీ కొత్త కండిషన్
-
Telangana Agriculture : పప్పుధాన్యాల సాగులో తెలంగాణకు రెండో స్థానం.. కేంద్రానికి కీలక ప్రతిపాదనలు
-
Shree Charani: ఎవరికీ అందని ఎత్తుకు ఎదిగిపోతున్న తెలుగు బిడ్డ.. రికార్డులను తిరగరాస్తున్న శ్రీచరణి..
-
Smriti Irani: ‘‘కర్ణాటక, కేరళ, హిమాచల్‌లో గెలిచింది ఎలా?’’.. కాంగ్రెస్‌పై స్మృతి ఇరానీ ఫైర్
-
AI Driving Test : డ్రైవింగ్ పరీక్షల్లో ‘ఏఐ’ విప్లవం.. మానవ జోక్యానికి చెక్ పెడుతూ కీలక నిర్ణయం..!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!