Site icon NTV Telugu

Tamil nadu: తమిళనాట ఘోర విషాదం.. విజయ్ ర్యాలీలో 30 మందికి పైగా మృతి..

Vijay

Vijay

Tamil nadu: తమిళ నటుడు, టీవీకే చీఫ్ విజయ్ ర్యాలీలో తొక్కిసలాట చోటు చేసుకుంది. కరూర్‌లో ఈరోజు విజయ్ నిర్వహించిన ర్యాలీకి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ఈ సమయంలోనే తొక్కిసలాట జరిగింది. మొత్తం 30 మందికి పైగా మరణించారు. మృతుల్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. 40 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని కరూర్‌లోని వివిధ ఆస్పత్రులకు తరలించారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

తమిళగా వెట్రీ కజగం (TVK) మద్దతుదారులు, విజయ్ అభిమానులు భారీ సంఖ్యలో రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. విజయ్ ఈ ర్యాలీకి దాదాపుగా 6 గంటలు ఆలస్యంగా వచ్చారని తెలుస్తోంది. తొక్కసలాటపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ర్యాలీలో చిన్నారి తప్పిపోయిందనే వార్త రాగానే, ఒక్కసారిగా జనాలు తోసుకోవడం ప్రారంభించారు. దీంతో పరిస్థితి అదుపు తప్పినట్లు తెలుస్తోంది. 10,000 మందితో ర్యాలీకి విజయ్ అనుమతి తీసుకున్నాడు. అయితే, ఊహించని రీతిలో జనాలు తరలివచ్చారు. ఇదే మొత్తం ఘటనకు కారణమైనట్లు అధికారులు చెబుతున్నారు.

Exit mobile version