NTV Telugu Site icon

Tamil Nadu: గొడ్డు మాంసం తిన్న విద్యార్థిని వేధించి, దాడి చేసిన ఉపాధ్యాయులు..

Tamil Nadu

Tamil Nadu

Tamil Nadu: తమిళనాడులోని ఇద్దరు అధ్యాపకులు సున్నితమైన అంశాన్ని వివాదంగా మార్చారు. కోయంబత్తూర్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థినిని గొడ్డుమాంసం తిన్నందుకు వేధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. బీఫ్ తిన్నందుకు తమన చిన్నారిని ఉపాధ్యాయులు వేధించడమే కాకుండా కొట్టారని సదరు కుటుంబం ఆరోపించింది.

అధ్యాపకులు అభినయ, రాజ్‌కుమార్ చిన్నారిని వేధించారని, బూట్ పాలిష్ చేయించారని ఆరోపిస్తూ సదరు కుటుంబం చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌కి ఫిర్యాదు చేశారు. చిన్నారి నగరంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతోందని, దాదాపు రెండు నెలలుగా ఈ రకంగా వేధింపులు జరుగుతున్నాయని హక్కుల కార్యకర్త హుస్సేన్ ఆరోపించారు.

Read Also: India-Canada: కెనడా పౌరుల కోసం ఈ-వీసా పున:ప్రారంభించనున్న భారత్..

‘‘గొడ్డు మాంసం తిన్నందుకు తమ బిడ్డను టీచర్ అభినయం వేధింపులకు గురి చేస్తోందని తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు చేసినప్పటికీ.. ప్రధానోపాధ్యాయుడు, సదరు టీచర్ చిన్నారిని బెదిరిస్తూనే ఉన్నారు.’’ కుటుంబం ఆరోపించింది.

అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్, స్థానిక పోలీసులు పాఠశాలను సందర్శించారు. చిన్నారి భద్రతకు భరోసా ఇచ్చారని హుస్సెన్ తెలిపారు. అయినా కూడా వేధింపులు కొనసాగాయని, చిన్నారి పర్దాతో బూట్లను క్లీన్ చేయమని బలవంతంగా చెప్పుతో కొట్టినట్లు చిన్నారి వెల్లడించినట్లు ఆయన తెలిపారు, చిన్నారికి టీసీ ఇస్తామని నిర్వాహకులు బెదిరించినట్లు టీచర్లపై ఆరోపించారు. ఫిర్యాదుపై స్పందించిన ప్రధాన విద్యాధిశాఖాధికారి విచారణ ప్రారంభించిన తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Show comments