Tamil Nadu: గొడ్డు మాంసం తిన్న విద్యార్థిని వేధించి, దాడి చేసిన ఉపాధ్యాయులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: తమిళనాడులోని ఇద్దరు అధ్యాపకులు సున్నితమైన అంశాన్ని వివాదంగా మార్చారు. కోయంబత్తూర్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థినిని గొడ్డుమాంసం తిన్నందుకు వేధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. బీఫ్ తిన్నందుకు తమన చిన్నారిని ఉపాధ్యాయులు వేధించడమే కాకుండా కొట్టారని సదరు కుటుంబం ఆరోపించింది.
అధ్యాపకులు అభినయ, రాజ్‌కుమార్ చిన్నారిని వేధించారని, బూట్ పాలిష్ చేయించారని ఆరోపిస్తూ సదరు కుటుంబం చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌కి ఫిర్యాదు చేశారు. చిన్నారి నగరంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతోందని, దాదాపు రెండు నెలలుగా ఈ రకంగా వేధింపులు జరుగుతున్నాయని హక్కుల కార్యకర్త హుస్సేన్ ఆరోపించారు.
Also Read
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
- SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
Read Also: India-Canada: కెనడా పౌరుల కోసం ఈ-వీసా పున:ప్రారంభించనున్న భారత్..
‘‘గొడ్డు మాంసం తిన్నందుకు తమ బిడ్డను టీచర్ అభినయం వేధింపులకు గురి చేస్తోందని తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు చేసినప్పటికీ.. ప్రధానోపాధ్యాయుడు, సదరు టీచర్ చిన్నారిని బెదిరిస్తూనే ఉన్నారు.’’ కుటుంబం ఆరోపించింది.
అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్, స్థానిక పోలీసులు పాఠశాలను సందర్శించారు. చిన్నారి భద్రతకు భరోసా ఇచ్చారని హుస్సెన్ తెలిపారు. అయినా కూడా వేధింపులు కొనసాగాయని, చిన్నారి పర్దాతో బూట్లను క్లీన్ చేయమని బలవంతంగా చెప్పుతో కొట్టినట్లు చిన్నారి వెల్లడించినట్లు ఆయన తెలిపారు, చిన్నారికి టీసీ ఇస్తామని నిర్వాహకులు బెదిరించినట్లు టీచర్లపై ఆరోపించారు. ఫిర్యాదుపై స్పందించిన ప్రధాన విద్యాధిశాఖాధికారి విచారణ ప్రారంభించిన తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
-
Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
-
Telangana SIR : తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు.. 12,204 ఓట్లు డిలీట్
-
Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
-
Nadendla Manohar : నాదెండ్ల మనోహర్ ఫైర్.. వైసీపీకి 11 సీట్లు కూడా రావంటూ వార్నింగ్.!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!