Tamil Nadu Rains: భారీ వర్షాలతో తమిళనాడు రాష్ట్రం మరోమారు అల్లాడిపోతోంది. దక్షిణ తమిళనాడులో కూరుస్తున్న ఎడతెరపి లేని వర్షాలకు రోడ్లు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. తిరునెల్వెలి, టుటికోరిన్, టెంకాసి, కన్యాకుమారి జిల్లాల్లో కూరుస్తున్న కుండపోత వర్షానికి జనజీవనం స్తంభించింది. అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. రోడ్లు దెబ్బతినడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్లు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఇల్లు జలమయం కాగా.. మరికొన్ని చోట్ల నీట మునిగిపోయాయి.
Also Read: Barrelakka: నేను పవన్ ఫ్యాన్.. నాతో కంపేర్ చేయడం బాధగా ఉంది!
పలు చోట్ల వరదల దాటికి చూస్తుండగానే భారీ భవంతిలు కొట్టుకుపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే ఆ సమయంలో ఇళ్లలో ప్రజలు ఉన్నారో లేదో తెలియాల్సి ఉంది. కాగా వరద తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాపనాశనం, పేరుంజని, పెచుపారై డ్యాముల నుంచి నీటిని వదలం.. తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీగా వరద చేరింది. ఈ వరదలకు లోతట్టు ప్రాంతాల్లో ని ఇళ్లు నీట మునిగాయి. దీంతో తమిళనాడు ప్రభుత్వం అక్కడ సహాయక చర్యలు చేపట్టింది. లోతట్టు ప్రాంత ప్రజలకు సీఎం ఎంకే స్టాలిన్ అక్కడ సహాయక చర్యలను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అవసరం అయితే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్లను, అధికారులను నిర్ధేశించారు.
అంతేకాదు దగ్గరుండి మరి ఆయన సహాయ చర్యలను పర్యవేక్షించారు. కాగా ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్, రాష్ట్ర పోలీస్ బలగాలు సహాయక చర్యలు చేపట్టారు. కాగా భారీ వర్షాల కారణంగా ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అలాగే, కొన్ని ప్రైవేట్ సంస్థలు, బ్యాంకులకు సైతం సెలవు ప్రకటించారు. అంతకాదు తమిళనాడు వైపు వెళ్లే పలు రైళ్లు, విమానాలు కూడా రద్దయ్యాయి. ట్రాకులపై నీరు నిలిచిపోగా, తిరునల్వేలికి రావాల్సిన, అక్కడి నుంచి వెళ్లాల్సిన వందేభారత్ సహా మొత్తం 17 రైళ్లను అధికారులు రద్దు చేశారు. అలాగే, తూత్తుకుడి నుంచి రాకపోకలు సాగించే కొన్ని విమానాలను దారి మళ్లీంచారు. మరికొన్నింటిని రద్దు చేశారు.
Also Read: Fire Accident: లక్నో ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. ఇద్దరు మృతి