Thiruparankundram Lamp Row: తమిళనాడులో తిరుపరంకుండ్రం సుబ్రమణ్య స్వామి ఆలయ దీపం వివాదం ఇటీవల దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కొండపై ఉన్న ఆలయం వద్ద దీపం వెలిగించాలని మద్రాస్ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా, డీఎంకే ప్రభుత్వం పట్టించుకోలేదు. దీనిపై వివాదం మొదలైంది. అయితే, ఆలయం వద్ద అధికారులు దీపం వెలిగించేందుకు అనుమతించకపోవడంపై తీవ్ర మనస్తాపానికి గురయ్యానని చెబుతూ 40 ఏళ్ల వ్యక్తి మధురైలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు ఓ వీడియోను రికార్డ్ చేశాడు.
Read Also: Avatar: Fire and Ash Review: అవతార్: ఫైర్ అండ్ యాష్ రివ్యూ
మృతుడిని పూర్ణచంద్రన్‌గా గుర్తించారు. ఒక వాహనంలో వచ్చి, కార్పొరేుషన్ కార్యాలయం సమీపంలో ఉన్న పెరియార్ విగ్రహం దగ్గర్లోని ఒక పోలీస్ బూత్ లోకి ప్రవేశించి, తనను తాను లోపల బంధించుకున్నాడు. తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెద్దగా కేకలు విన్న స్థానికులు మంటల్ని గమనించి అగ్నిమాపక, రెస్క్యూ సర్వీసుకు సమాచారం అందించారు. తీవ్రమైన కాలిన గాయాలైన బాధితుడి బయటకు తీశారు. ఆ తర్వాత అతను మరణించాడు. మృతదేహాన్ని తల్లకులం పోలీసులు జిల్లా ప్రభుత్వాసుపత్రికి పంపారు.
పూర్ణచంద్రన్ రికార్డ్ చేసిన వీడియోలో..‘‘ దీపం వెలిగించడంపై ప్రభుత్వానికి ఏం సమస్య ఉందో నాకు తెలియదు. హిందువులందరూ ఆలోచించాలి’’ అని కోరాడు. ‘‘దీపతున్‌పై దీపం వెలిగిస్తే మధురైకి మరింత కీర్తి వస్తుంది’’ అని వీడియోలో చెప్పాడు. దీపం వెలిగించడాన్ని అధికారులు అడ్డుకోవడం తీవ్రమైన మానసిక ఒత్తిడిని కలిగించాయని, దేవుడు లేడని పెరియార్ ముందు తాను నిప్పటించుకుంటానని చెప్పాడు. తిరుపరంకుండ్రంలో దేవుడు ఉన్నాడని అతడికి చూపించాలని, 2026లో అక్కడ దీపం వెలిగించాలని అని కోరాడు. ఈ ఘటనపై మధురై పోలీసులు విచారణ ప్రారంభించారు.
