Tamil Nadu: ఆస్తి కోసం తండ్రిపై కొడుకు దాడి.. వీడియో వైరల్, నిందితుడి అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: తనకు జన్మనిచ్చి, కంటికి రెప్పలా చూసుకున్న తల్లిదండ్రుల పట్ల కొందరు కొడుకుల, కూతుళ్లు కర్కషంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా తమిళనాడులో ఓ వ్యక్తి ఆస్తి కోసం తన తండ్రిపై దారుణంగా దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఫిబ్రవరి 16న ఈ ఘటన జరిగింది. అయితే, ఈ వీడియో వైరల్ అయిన తర్వాత మాత్రమే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
READ ALSO: PM Modi: నేహ మర్డర్‌పై స్పందించిన ప్రధాని.. ఓట్ బ్యాంక్ రాజకీయాలని కాంగ్రెస్‌పై ఫైర్..
Also Read
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
- INDIA Bloc: ‘‘ఓట్ చోరీ’’పై ఇండీ కూటమి యాక్షన్ ప్లాన్..
- Central Cabinet Decision: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
కుర్చీలో కూర్చున్న తండ్రి వద్దకు వచ్చిన కొడుకు, అతని ముఖం, ఛాతీపై పిడిగుద్దులు కరిపించాడు. ముఖాన్ని టార్గెట్ చేసుకుంటూ చేతులు, కాళ్లతో దారుణంగా దాడి చేశాడు. ఈ ఘటనను చూసిన మరొక వ్యక్తి వచ్చి ఆపేవరకు ఇలా దాడి చేస్తూనే ఉన్నాడు. ఈ ఘటన అంతా అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఈ ఘటన తమిళనాడు లోని పెరంబలూర్ జిల్లాలో చోటు చేసుకుంది. నిందితుడిని సంతోష్‌గా గుర్తించారు. బాధితుడిని సంతోష్ తండ్రి కులంతైవేలుగా గుర్తించారు.
అయితే, ఈ దాడి తర్వాత ఏప్రిల్ 18న కులంతైవేలు గుండెపోటుతో మరణించాడు. ఆస్తి వివాదంతోనే తండ్రిపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. సంతోష్‌పై ఐపీసీ 323 (బాధ కలిగించినందుకు శిక్ష) మరియు 324 (ఆయుధంతో గాయపరచడం) సహా అభియోగాల కింద అరెస్టు చేశారు. అతడు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
⚠️Disturbing Visual
Man beats to death his father over property dispute….
Where are we heading as a society and humans ?? pic.twitter.com/QsnK4OwHxQ
— Amitabh Chaudhary (@MithilaWaala) April 28, 2024
తాజావార్తలు
-
CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
-
Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
-
flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
-
Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
-
Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!