Site icon NTV Telugu

Tamil Nadu: ఆస్తి కోసం తండ్రిపై కొడుకు దాడి.. వీడియో వైరల్, నిందితుడి అరెస్ట్..

Tamil Nafu

Tamil Nafu

Tamil Nadu: తనకు జన్మనిచ్చి, కంటికి రెప్పలా చూసుకున్న తల్లిదండ్రుల పట్ల కొందరు కొడుకుల, కూతుళ్లు కర్కషంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా తమిళనాడులో ఓ వ్యక్తి ఆస్తి కోసం తన తండ్రిపై దారుణంగా దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఫిబ్రవరి 16న ఈ ఘటన జరిగింది. అయితే, ఈ వీడియో వైరల్ అయిన తర్వాత మాత్రమే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

READ ALSO: PM Modi: నేహ మర్డర్‌పై స్పందించిన ప్రధాని.. ఓట్ బ్యాంక్ రాజకీయాలని కాంగ్రెస్‌పై ఫైర్..

కుర్చీలో కూర్చున్న తండ్రి వద్దకు వచ్చిన కొడుకు, అతని ముఖం, ఛాతీపై పిడిగుద్దులు కరిపించాడు. ముఖాన్ని టార్గెట్ చేసుకుంటూ చేతులు, కాళ్లతో దారుణంగా దాడి చేశాడు. ఈ ఘటనను చూసిన మరొక వ్యక్తి వచ్చి ఆపేవరకు ఇలా దాడి చేస్తూనే ఉన్నాడు. ఈ ఘటన అంతా అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఈ ఘటన తమిళనాడు లోని పెరంబలూర్ జిల్లాలో చోటు చేసుకుంది. నిందితుడిని సంతోష్‌గా గుర్తించారు. బాధితుడిని సంతోష్ తండ్రి కులంతైవేలుగా గుర్తించారు.

అయితే, ఈ దాడి తర్వాత ఏప్రిల్ 18న కులంతైవేలు గుండెపోటుతో మరణించాడు. ఆస్తి వివాదంతోనే తండ్రిపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. సంతోష్‌పై ఐపీసీ 323 (బాధ కలిగించినందుకు శిక్ష) మరియు 324 (ఆయుధంతో గాయపరచడం) సహా అభియోగాల కింద అరెస్టు చేశారు. అతడు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version