Site icon NTV Telugu

Pongal Gift: సంక్రాంతి కానుక.. ప్రజలకు నగదు, పొంగల్‌ గిఫ్ట్‌

M K Stalin

M K Stalin

సంక్రాంతి పండుగ వేళ ప్రజలకు శుభవార్త చెప్పారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌.. సంక్రాంతి పండుగ సందర్భంగా పొంగల్‌ గిఫ్ట్‌ అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు.. రేషన్ కార్డ్ దారులకు వెయ్యి రూపాయల నగదు పాటు.. ఒక కేజీ చక్కెర, కేజీ బియ్యం కానుకగా అందిస్తున్నారు.. తమిళనాడులోని 2.19 కోట్లమందికి ఈ పండుగకు ప్రయోజనం చేకూరనుంది.. రేషన్ కార్డ్ హోల్డర్లు అందరూ దీనికి అర్హులు.. ఇది శ్రీలంక పునరావాస శిబిరాల్లో నివసిస్తున్న కుటుంబాలకు కూడా వర్తిస్తుంది. ఒక్కో కేజీ బియ్యం, పంచదార కూడా లబ్ధిదారులకు అందించనున్నారు. 2,356.67 కోట్ల వ్యయంతో 2.19 కోట్ల మంది రేషన్ కార్డు హోల్డర్లకు ప్రయోజనం చేకూర్చనుంది ప్రభుత్వం.. ముఖ్యమంత్రి స్టాలిన్ జనవరి 2వ తేదీన పొంగల్ గిఫ్ట్ పథకాన్ని ప్రారంభించనున్నారు.. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ కానుకల పంపిణీకి సిద్ధం అయ్యారు అధికారులు.. రేషన్‌ షాపుల ద్వారా పొంగల్‌ కిట్ల పంపిణీ చేపట్టనున్నారు.. మరోసారి కరోనా భయపెడుతోన్న వేళ.. కోవిడ్‌ మార్గదర్శకాలకు లోబడి వీటిని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Read Also: Kaikala Satyanarayana: స్టార్స్ తో స‌త్య‌నారాయ‌ణ చిత్రాలు!

Exit mobile version