తమిళనాడులో గత 6 రోజులుగా కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితులు తొలగిపోతున్నాయి. గవర్నర్ వర్సెస్ విజయ్ పార్టీల మధ్య సాగిన రాద్ధాంతం ఎట్టకేలకు ముగిసింది. తాజాగా విజయ్‌కు వీసీకే, ముస్లిం లీగ్ పార్టీలు మద్దతు తెల్పాయి. దీంతో టీవీకే బలం 120కు చేరింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయింది.
ఇదిలా ఉంటే మరికాసేపట్లో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌ను విజయ్ కలవబోతున్నారు. 120 ఎమ్మెల్యేల మద్దతు లేఖను విజయ్ అందజేయనున్నారు. మద్దతు లేఖను పరిశీలించిన తర్వాత విజయ్‌ను ప్రమాణస్వీకారానికి లోక్‌భవన్ ఆహ్వానించనుంది. ఇదిలా ఉంటే శనివారం రాత్రి గవర్నర్ అర్లేకర్ కేరళం వెళ్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అర్లేకర్ కేరళం గవర్నర్‌గా ఉన్నారు. తమిళనాడులో అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈ రాత్రికి కేరళం వెళ్తున్నట్లుగా సమాచారం. అయితే విజయ్ భేటీ తర్వాత ఏమైనా మార్పులు జరగొచ్చా? అన్నది తెలియాల్సి ఉంది.
అన్ని సంక్రమంగా ఉంటే వెంటనే విజయ్‌ను గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించే అవకాశం ఉంది. అయితే ప్రమాణస్వీకారం ఎప్పుడు జరుగుతుందనేది స్పష్టత రావాల్సి ఉంది. ఈ రాత్రికే జరగవచ్చని వార్తలు వస్తున్నాయి. గవర్నర్‌తో భేటీ తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
#WATCH | Tamil Nadu: IUML extends unconditional support to TVK to form a government in the state.
With this, TVK now has the support of Congress, CPI, CPI(M), VCK, IUML, taking its tally to 121, crossing the majority mark of 118.
(Video Source: IUML) pic.twitter.com/XYCbrHjKnK
— ANI (@ANI) May 9, 2026
Tamil Nadu: IUML extends unconditional support to TVK to form a government in the state.
With this, TVK now has the support of Congress, CPI, CPI(M), VCK, IUML, taking its tally to 121, crossing the majority mark of 118. pic.twitter.com/pERoJbxQ7i
— ANI (@ANI) May 9, 2026
Tamilaga Vettri Kazhagam gets VCK backing in Tamil Nadu, Vijay expected to meet Governor as he gets majority support
Read @ANI Story| https://t.co/m1xFusowtr #VCK #TamilNadu #Majority pic.twitter.com/PR8VfrXk04
— ANI Digital (@ani_digital) May 9, 2026
