Tamil Nadu: రేపు లోక్‌భవన్ ఎదుట ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపు
- తమిళనాడులో రాజకీయ అనిశ్చితి
- కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ను పిలవని గవర్నర్
- గవర్నర్ తీరుపై కాంగ్రెస్ ఆగ్రహం
- రేపు లోక్‌భవన్ ఎదుట ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధం నెలకొంది. అతి పెద్ద పార్టీగా అవతరించిన విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించేందుకు గవర్నర్ నిరాకరించారు. మ్యాజిక్ ఫిగర్ చూపిస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తానని గవర్నర్ తేల్చి చెప్పారు. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
అయితే గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ తీరుపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. గవర్నర్ ఉద్దేశపూర్వకంగానే కుట్రలు పన్నుతున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో గవర్నర్ తీరుకు నిరసనగా శుక్రవారం లోక్‌భవన్ ఎదుట, రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు చేపట్టాలని కాంగ్రెస్ పిలుపునిచ్చింది. తమిళనాడు గవర్నర్, బీజేపీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని శ్రేణులకు విజ్ఞప్తి చేసింది. బల నిరూపణ అనేది విజయ్ అసెంబ్లీలో ప్రూవ్ చేసుకుంటారని.. ముందే ఎలాంటి నిరూపించుకుంటారని కాంగ్రెస్ నిలదీసింది.
Also Read
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
- Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
- Rahul Gandhi: రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానానికి గో-అరౌండ్.. రెండో ప్రయత్నంలో సేఫ్ ల్యాండింగ్!
- Supreme Court: టెట్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ఇకపై ఆ అర్హతలు తప్పనిసరి!
సోమవారం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు గాను టీవీకే 108 స్థానాలు గెలుచుకుంది. మ్యాజిక్ ఫిగర్‌కు 10 సీట్లలో దూరంలో ఉంది. అయితే విజయ్‌కు కాంగ్రెస్ ఐదుగురు ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. దీంతో 113 ఎమ్మెల్యేల మద్దతు లేఖను గవర్నర్‌కు విజయ్ అందజేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. కానీ గవర్నర్ మాత్రం ససేమిరా అన్నారు. పూర్తి ఫిగర్ చూపిస్తేనే ఆహ్వానిస్తానని తేల్చి చెప్పారు. దీంతో రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి ఏర్పడింది.
తాజావార్తలు
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!
-
Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్‌కు షాక్.. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు దూరం.. అసలు కారణం ఇదే!
-
Tata Nexonపై రూ.75,000 వరకు ఆఫర్.. స్క్రాపేజ్ బెనిఫిట్‌తో మరింత ఆదా.!
-
CM Chandrababu: నేడు కోనసీమలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులతో ముఖాముఖి, పార్టీ కార్యకర్తలతో సమావేశం!
-
కేవలం 6.39 మి.మీ. మందం, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO CAMON Slim 5G లాంచ్.!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!