Site icon NTV Telugu

MK Stalin: అమెరికా టూర్‌లో తమిళనాడు సీఎం షికార్లు.. షికాగోలో సైకిల్‌ సవారీ

Mkstalin

Mkstalin

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ అమెరికా పర్యటనలో కొంత సమయం జాలిగా గడిపారు. షికాగో సరస్సు తీరంలో సరదాగా సైకిల్‌ తొక్కారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో అందర్నీ ఆకర్షించింది. కాంగ్రెస్‌ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ తనదైన శైలిలో స్పందించారు. చెన్నైలో మనమిద్దరం కలిసి ఎప్పుడు సైక్లింగ్‌ చేద్దాం మిత్రమా అంటూ ట్వీట్‌ చేశారు.

ఇది కూడా చదవండి: Crime: దారుణం.. పింఛన్ డబ్బులు ఇవ్వకపోవడంతో మాజీ సైనికుడిని కొట్టి చంపిన మనవడు

పెట్టుబడులే లక్ష్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో తీరిక వేళ షికాగోలో సైకిల్‌ రైడ్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. దీనిపై రాహుల్‌ గాంధీ సరదాగా కామెంట్‌ చేశారు. దీనికి బదులిచ్చిన స్టాలిన్‌.. ‘‘డియర్‌ బ్రదర్‌.. మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు సైకిల్‌ తొక్కుతూ చెన్నై నగరాన్ని చుట్టేద్దాం. మీకోసం మిఠాయిలు కూడా వేచిచూస్తున్నాయి. సైక్లింగ్‌ తర్వాత మా ఇంట్లో దక్షిణాది వంటకాన్ని ఆస్వాదించి.. స్వీట్ల రుచి చూద్దాం’’ అని స్టాలిన్‌ పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ సంభాషణ కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Exit mobile version