NTV Telugu Site icon

Tamil Nadu: బీజేపీలో శరత్ కుమార్ పార్టీ విలీనం.. అన్నామలై సమక్షంలో చేరిక

Sharath Kumar, Annamalai

Sharath Kumar, Annamalai

Tamil Nadu: లోక్‌సభ ఎన్నికల ముందు తమిళనాడులో కీలక పరిణామం జరిగింది. ప్రముఖ తమిళనటుడు శరత్ కుమార్ తన పార్టీని బీజేపీలో విలీనం చేసింది. అఖిల ఇండియా సమతువ మక్కల్ కట్చీ(AISMK)ని బిజెపిలో విలీనం చేశారు. బీజేపీ తమిళనాడు చీఫ్ అన్నామలై సమక్షంలో శరత్ కుమార్, ఆయన పార్టీ కార్యకర్తలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశఐక్యతను పెంపొందించంతో పాటు ఆర్థికాభివృద్ధిని సాధించేందుకు మోడీకి సహకరిస్తానని శరత్ కుమార్ అన్నారు.

Read Also: Kidney Fraud: కిడ్నీకి రూ.2 కోట్లు వస్తాయని తెలిసి ఆ చార్టర్డ్ అకౌంటెంట్.. చివరకు..?!

2026లో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని శరత్ కుమార్ తన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శరత్ కుమార్ చేరితో బీజేపీ మరింత బలపడుతుందని అన్నామలై అన్నారు. బీజేపీ కుటుంబం మరింత విస్తరించిందని అన్నారు. తమిళనాడు నుంచి ఎక్కువ మంది ఎంపీలకు పార్లమెంట్‌కి పంపాలన్న పార్టీ నిబద్ధతను ఈ విలీన కార్యక్రమం బలోపేతం చేస్తుందని ఆయన అన్నారు. డీఎంకే పార్టీలో మొదట చేరిన శరత్ కుమార్‌ని ఆ పార్టీ రాజ్యసభకు నామినేట్ చేసింది, డీఎంకే నుంచి బయటకు వచ్చి ఏఐడీఎంకేలో చేరారు. ఆ తర్వాత 2007లో ఎఐఎస్ఎంకే పార్టీని స్థాపించారు. ప్రస్తుతం దీన్ని బీజేపీలో విలీనం చేశారు.