Site icon NTV Telugu

Kerala: కేరళలో వాహనదారులకు కొత్త రూల్స్.. ఇకపై ఇలా చేస్తే ఫైన్..!

Kerala

Kerala

ప్రమాదాలను అరికట్టేందుకు కేరళ రాష్ట్రం సరికొత్త రూల్స్ అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపై బైక్ ప్రయాణంలో వెనుక సీట్లో కూర్చొని ఉన్న వ్యక్తితో మాట్లాడినా నేరంగా పరిగణించాలని కొత్త నిబంధన అమల్లోకి తెచ్చింది. పరధ్యానాన్ని తగ్గించడానికి, ప్రమాదాలను నివారించడానికి ద్విచక్ర వాహనదారులు పిలియన్ రైడర్‌లతో సంభాషించడాన్ని కేరళ నిషేధించింది.

ఇది కూడా చదవండి: Rahul Gandhi: “రాజ్యాంగానికి అతీతుడివి కాదు”.. రాహుల్ తీరుపై కేంద్రమంత్రుల ఆగ్రహం..

రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కేరళ ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకువచ్చింది. అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగే కాదు.. ఒక్కోసారి ద్విచక్రవాహనంలో ప్రయాణించేటప్పుడు వెనుక కూర్చొన్న వ్యక్తితో చోదకుడు మాట్లాడటం కూడా ప్రమాదాలకు దారి తీస్తుందని భావించిన ప్రభుత్వం.. ఓ కొత్త నిబంధనను అమలులోకి తీసుకొచ్చింది. ఇకపై డ్రైవింగ్‌ సమయంలో వెనుక సీట్లో కూర్చొన్న వ్యక్తితో మాట్లాడడం శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు. ఈ నిబంధన అన్ని రకాల ద్విచక్ర వాహనాలకు వర్తిస్తుంది. ఒకవేళ నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తారు. పదే పదే ఈ నేరం పునరావృతమైతే తీవ్రమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

ఇది కూడా చదవండి: Off The Record: అసెంబ్లీ సాక్షిగా చేసిన ఎమ్మెల్యే ఆరోపణల్లో నిజమెంత?

కొత్త రూల్స్‌ను కచ్చితంగా అమలు చేయాలని ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్‌ పోలీసులకు ఆదేశాలు జారీ అయ్యాయి. వెనుక వ్యక్తితో మాట్లాడుతున్న రైడర్‌కు చలానాలు పంపనుంది. అయితే.. ఎంత మొత్తంలో జరిమానా విధిస్తారో మాత్రం తెలియలేదు. దీనిపై ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిబంధన బాగుందని కొందరు అభినందిస్తుంటే.. ఆంక్షలు మరీ కఠినంగా ఉన్నాయంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

ఇది కూడా చదవండి: Borewell Incident: బోరుబావిలో పడిన 3 ఏళ్ల బాలిక.. పుట్టిన రోజు వేడుకలకు ముందే ఘటన..

Exit mobile version