Taliban: మహిళల్ని బహిరంగంగా రాళ్లతో కొట్టి చంపే శిక్షను అమలు చేయనున్న తాలిబాన్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Taliban: ఆఫ్ఘానిస్తాన్‌లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ దేశంలో మహిళల హక్కులకు పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయింది. మహిళలు వంటిళ్లకే పరిమితమయ్యారు. చివరకు బాలికల విద్యను కూడా తాలిబాన్లు నిషేధించారు. ఇక వారు ఉద్యోగాలకు స్వస్తి చెప్పాల్సి వచ్చింది. చివరకు అంతర్జాతీయ మిషన్లలో కూడా పనిచేసేందుకు మహిళలను అనుమతించడం లేదు. బయటకు వెళ్లాలన్నా, ఇంట్లో పురుషుడి తోడు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతర్జాతీయ సమాజం ఈ వివక్ష పట్ల ఎంత ఆందోళన వ్యక్తం చేసిని అక్కడి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
Read Also: BRS KTR: కష్ట కాలంలో కేకే, కడియం పార్టీ వదిలి వెళుతున్నారు..! కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
Also Read
- Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
- Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
ఇదిలా ఉంటే తాజాగా మరో కఠిన శిక్షను అమలులోకి తెచ్చేందుకు తాలిబాన్లు సిద్ధమైనట్లు సమాచారం. వ్యభిచారానికి పాల్పడే మహిళల్ని బహిరంగంగా రాళ్లతో కొట్టి శిక్షించే శిక్షను అమలు చేయబోతున్నారు. తాలిబాన్ సుప్రీం లీడర్ ముల్లాహిబతుల్లా అఖుంద్జాదా ఈ శిక్షను పున:ప్రారంభించినట్లు ప్రటించారు. ‘‘మహిళలను రాళ్లతో కొట్టి చంపడం మహిళల హక్కులను ఉల్లంఘించడమేనని మీరు అంటున్నారు. అయితే వ్యభిచారానికి సంబంధించి శిక్షను త్వరలో అమలు చేస్తాం. మహిళల్ని బహిరంగంగా కొరడాలతో, రాళ్లతో కొట్టి చంపుతాము’’ అని అతను చెప్పాడు. గత శనివారం ఆ దేశ టీవీలో ప్రసారం చేయబడిన సందేశంలో చెప్పాడు.
2021లో తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రజాప్రభుత్వాన్ని దించేసి అధికారంలో వచ్చారు. అప్పటి నుంచి మహిళలు తీవ్ర సవాళ్లను ఎదుర్కొటున్నారు. ఇప్పటికే బాలికలు సెకండరీ పాఠశాల విద్యను నిషేధించారు. ప్రపంచంలో ఆఫ్ఘన్ మహిళ పరిస్థితి అధ్వాన్నంగా ఉందని యూఎన్ ఒక నివేదికలో వెల్లడించింది. గత రెండేళ్లోల బాలిక ఆత్మహత్య రేటు పెరగడం అక్కడి పరిస్థితులకు అద్దం పడుతోంది.
తాజావార్తలు
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
ట్రెండింగ్
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!