Site icon NTV Telugu

Taliban: మహిళల్ని బహిరంగంగా రాళ్లతో కొట్టి చంపే శిక్షను అమలు చేయనున్న తాలిబాన్లు..

Afghan

Afghan

Taliban: ఆఫ్ఘానిస్తాన్‌లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ దేశంలో మహిళల హక్కులకు పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయింది. మహిళలు వంటిళ్లకే పరిమితమయ్యారు. చివరకు బాలికల విద్యను కూడా తాలిబాన్లు నిషేధించారు. ఇక వారు ఉద్యోగాలకు స్వస్తి చెప్పాల్సి వచ్చింది. చివరకు అంతర్జాతీయ మిషన్లలో కూడా పనిచేసేందుకు మహిళలను అనుమతించడం లేదు. బయటకు వెళ్లాలన్నా, ఇంట్లో పురుషుడి తోడు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతర్జాతీయ సమాజం ఈ వివక్ష పట్ల ఎంత ఆందోళన వ్యక్తం చేసిని అక్కడి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

Read Also: BRS KTR: కష్ట కాలంలో కేకే, కడియం పార్టీ వదిలి వెళుతున్నారు..! కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

ఇదిలా ఉంటే తాజాగా మరో కఠిన శిక్షను అమలులోకి తెచ్చేందుకు తాలిబాన్లు సిద్ధమైనట్లు సమాచారం. వ్యభిచారానికి పాల్పడే మహిళల్ని బహిరంగంగా రాళ్లతో కొట్టి శిక్షించే శిక్షను అమలు చేయబోతున్నారు. తాలిబాన్ సుప్రీం లీడర్ ముల్లాహిబతుల్లా అఖుంద్జాదా ఈ శిక్షను పున:ప్రారంభించినట్లు ప్రటించారు. ‘‘మహిళలను రాళ్లతో కొట్టి చంపడం మహిళల హక్కులను ఉల్లంఘించడమేనని మీరు అంటున్నారు. అయితే వ్యభిచారానికి సంబంధించి శిక్షను త్వరలో అమలు చేస్తాం. మహిళల్ని బహిరంగంగా కొరడాలతో, రాళ్లతో కొట్టి చంపుతాము’’ అని అతను చెప్పాడు. గత శనివారం ఆ దేశ టీవీలో ప్రసారం చేయబడిన సందేశంలో చెప్పాడు.

2021లో తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రజాప్రభుత్వాన్ని దించేసి అధికారంలో వచ్చారు. అప్పటి నుంచి మహిళలు తీవ్ర సవాళ్లను ఎదుర్కొటున్నారు. ఇప్పటికే బాలికలు సెకండరీ పాఠశాల విద్యను నిషేధించారు. ప్రపంచంలో ఆఫ్ఘన్ మహిళ పరిస్థితి అధ్వాన్నంగా ఉందని యూఎన్ ఒక నివేదికలో వెల్లడించింది. గత రెండేళ్లోల బాలిక ఆత్మహత్య రేటు పెరగడం అక్కడి పరిస్థితులకు అద్దం పడుతోంది.

Exit mobile version