Site icon NTV Telugu

Taliban minister: ఆఫ్ఘన్ నుంచి భారత్‌కు కీలక హామీ.. పాకిస్తాన్‌కు తాలిబాన్ స్ట్రాంగ్ వార్నింగ్..

Taliban Minister

Taliban Minister

Taliban minister: 2021లో ఆఫ్ఘానిస్తాన్‌లో తాలిబాన్లు అధికారాన్ని చేపట్టిన తర్వాత, తొలిసారిగా తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ భారతదేశంలో పర్యటిస్తున్నారు. ఆయన విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో శుక్రవారం భేటీ అయ్యారు. రెండు దేశాలు సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని చర్చించాయి. ఇదిలా ఉంటే, ఆఫ్ఘన్ నేలను భారత్‌కు కానీ, మరే దేశానికి వ్యతిరేకంగా ఉపయోగించుకోవడానికి అనుమతించేది లేదని ముత్తాకీ అన్నారు. జైశంకర్‌తో భేటీ తర్వాత ఆయన నుంచి ఈ హామీ వచ్చింది.

Read Also: SS Rajamouli : ఫస్ట్ టైమ్ ఎన్టీఆర్ ను చూసి రాజమౌళి ఏం అనుకున్నాడో తెలుసా..?

రెండు దేశాల మధ్య చర్యలు విజయవంతం అయినట్లు ముత్తాకీ చెప్పారు. అభివృద్ధి ప్రాజెక్టుల కొనసాగింపు, ఆఫ్ఘనిస్తాన్ లో భారత పరిధి విస్తరించాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు. భద్రతా రంగంలో తాలిబాన్ ప్రభుత్వం ప్రాంతీయ స్థిరత్వాన్ని నిర్ధారించడానికి కట్టుబడి ఉన్నట్లు ముత్తాకీ చెప్పారు.

ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్ భారత్ గడ్డపై నుంచి పాకిస్తాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. పాకిస్తాన్ విధానం వల్ల సమస్యలు పరిష్కారం కావని హెచ్చరించారు. ఆఫ్ఘన్ ప్రజలు సహనం, ధైర్యాన్ని సవాలు చేయకూడదని, ఎవరికైనా తెలియకపోతే వారు బ్రిటీష్, సోవియట్, అమెరికన్లను అడగాలి అని అన్నారు. ఆఫ్ఘనిస్తాన్ భారత్, పాకిస్తాన్‌ రెండింటితో స్నేహపూర్వక సంబంధాలను కోరుకుంటుందని చెప్పారు.

Exit mobile version