NTV Telugu Site icon

Taj Mahal: వహ్‌.. తాజ్‌. 144 కట్టడాల్లో టాప్‌లో నిలిచిన తాజ్‌మహల్‌.

Taj Mahal

Taj Mahal

Taj Mahal: ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లోనే మన దేశంలో ఎక్కువ మంది సందర్శించిన చారిత్రక కట్టడంగా తాజ్‌మహల్‌ టాప్‌లో నిలిచింది. టికెట్ల కొనుగోళ్ల ద్వారా 25 కోట్ల రూపాయలకు పైగా ఇన్‌కమ్‌ని సంపాదించింది. అంటే నెలకు యావరేజ్‌గా 5 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. దేశవ్యాప్తంగా ఆర్కియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ఏఎస్‌ఐ) సంరక్షణలో ఉన్న మొత్తం 144 కట్టడాల్లో తాజ్‌మహల్‌ నంబర్‌-1 స్థానాన్ని ఆక్రమించటం విశేషం. ఈ అద్భుత నిర్మాణాన్ని చూసేందుకు ఏటా 70 నుంచి 80 లక్షల మంది వరకు వస్తుంటారు. ఇందులో 8 లక్షల మందికి పైగా విదేశీయులే ఉంటారు.

తాజ్‌మహల్‌ ఎంట్రీ టికెట్‌ ధర లోకల్‌వాళ్లకు రూ.50 కాగా విదేశీయుల నుంచి ఏకంగా రూ.1,100 వసూలు చేస్తున్నారు. అందువల్ల ఈ మోముమెంట్‌కి వచ్చే మొత్తం రెవెన్యూలో అత్యధిక వాటా ఇతర దేశాలవాళ్లదే అవుతోంది. స్థానికుల ద్వారా రూ.40 కోట్లు మాత్రమే ఆదాయం వస్తుండగా ఫారనర్స్‌ ద్వారా రూ.110 కోట్లు వస్తుండటం గమనార్హం. తమిళనాడులోని మామళ్లపురం కట్టడాల సముదాయంతోపాటు భువనేశ్వర్‌లోని సూర్యదేవాలయంతో పోల్చితే తాజ్‌మహల్‌కి 10 రెట్లు ఎక్కువ ఇన్‌కమ్‌ వస్తోంది. ఢిల్లీలోని ఎర్రకోటతో పోల్చితే 5 రెట్లు అధిక రెవెన్యూ జనరేట్‌ అవుతోంది.

read also:
Bhagwant Mann: ఆస్పత్రిలో చేరిన పంజాబ్ ముఖ్యమంత్రి.. కారణం ఏంటంటే?
అయితే.. తాజ్‌మహల్‌ ఆదాయం 2020తో పోల్చితే ఈసారి 74 శాతం తగ్గింది. కరోనా ఆంక్షలే దీనికి కారణం. 2020లో రూ.97 కోట్ల రెవెన్యూ రాగా ప్రస్తుతానికి రూ.25.6 కోట్లే వచ్చింది. 2021లో కూడా కొవిడ్‌ వల్ల లక్ష మంది సందర్శకులు తగ్గారు. కానీ ఈసారి మొదటి 5 నెలల్లోనే 4 లక్షల మందికి పైగా టూరిస్టులు వచ్చారు. అంటే నెలకి సగటున లక్ష మందికి పైగా వచ్చారు. మహమ్మారి కారణంగా ఈ ఏడాది మన దేశంలోని టాప్‌-10 చారిత్రక కట్టడాల్లో ఏకంగా ఏడింటి రెవెన్యూ 50 శాతానికి పైగా పడిపోయింది.

తాజ్‌మహల్‌ 74 శాతం, మౌసోలియం 35, రెడ్‌ఫోర్ట్‌ 63, కుతుబ్‌మీనార్‌ 75, ఆగ్రా కోట 86, మామళ్లపురం 49, కోణార్క్‌లోని సన్‌ టెంపుల్‌ 70 శాతం, చిత్తోర్‌గఢ్‌ ఫోర్ట్‌ 26, గోల్కొండ 53, హంపి 56 శాతం ఆదాయాలను కోల్పోయాయి. ఈ ఏడాది మే నాటికి ఉత్తరప్రదేశ్‌లోని తాజ్‌మహల్‌ తర్వాత మౌసోలియం కట్టడం రూ.6.3 కోట్ల రెవెన్యూని ఆర్జించింది.

ఢిల్లీలోని రెడ్‌ఫోర్ట్‌ రూ.6 కోట్లు, కుతుబ్‌మీనార్‌ రూ.5 కోట్లు, యూపీలోని ఆగ్రా కోట రూ.4 కోట్లు, మామళ్లపురంలోని చారిత్రక కట్టడాల సముదాయం రూ.3.9 కోట్లు, ఒడిశాలోని సూర్యదేవాలయం 2.4 కోట్లు, రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌ పోర్ట్‌ 2.3 కోట్లు, తెలంగాణ(హైదరాబాద్‌)లోని గోల్కొండ కోట 2.2 కోట్లు, మహారాష్ట్రలోని ఎల్లోరా గుహలు రూ.1.6 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాయి.