Site icon NTV Telugu

Swiggy: స్విగ్గీ, IRCTC మధ్య కీలక ఒప్పందం.. ఇకపై రైళ్లలో స్విగ్గీ డెలివరీలు..

Swiggy

Swiggy

Swiggy: ఇకపై రైళ్లలో స్విగ్గీ ఫుడ్ డెలివరీలు చేయనుంది. ఈ మేరకు స్విగ్గీ, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)తో ఒప్పందం కుదుర్చుకుంది. రాబోయే ఆరు నెలల్లో 59కి పైగా రైల్వే స్టేషన్లలో తమ సేవలను విస్తరించాలని యోచిస్తోంది. మార్చి 12 నుంచి బెంగళూరు, భువనేశ్వర్, విశాఖపట్నం, విజయవాడ రైల్వే స్టేషన్లలో ఆహారాన్ని డెలివరీ చేయనున్నారు. IRCTC చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ జైన్, స్విగ్గీ ఫుడ్ మార్కెట్‌ప్లేస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) రోహిత్ కపూర్ మధ్య ఎంఓయూ కుదిరింది. రైళ్లలో ముందస్తుగా ఆర్డర్ చేసిన వారికి ఆహారాన్ని స్విగ్గీ డెలివరీ చేస్తుంది.

Read Also: KTR: రేవంత్‌రెడ్డి మరో ఏక్‌నాథ్‌ షిండే..! ఎన్నికల తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకుంటారు

ఈ సర్వీస్ మార్చి 12 నుండి బెంగళూరు, భువనేశ్వర్, విశాఖపట్నం, విజయవాడ అనే నాలుగు స్టేషన్లతో ప్రారంభమవుతుంది, రాబోయే వారాల్లో 59 అదనపు సిటీ స్టేషన్లకు విస్తరించబడుతుంది. రైలు ప్రయాణాలు మరింత సౌకర్యవంతంగా చేయడానికి కొత్త మార్గాలు అన్వేషించబడుతున్నాయని జైన్ అన్నారు. స్విగ్గీ భాగస్వామ్యంతో మా ప్రయాణికులకు మరింత ఆహార ఎంపికలో మరింత సౌలభ్యం ఉంటుందని చెప్పారు.

సంజయ్ కుమార్ జైన్ మాట్లాడుతూ.. ‘‘IRCTC సుమారు 350 A మరియు A1 క్లాస్ స్టేషన్‌లలో మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఎక్కువ సేపు నిలుపుతాయి. మేం జొమాటాతో సహా 17 అగ్రిగేటర్లతో సహకరిస్తున్నాము. మా ఈ-క్యాటరింగ్ వ్యాపారం ఈ ఏడాది ఇప్పటికే రూ. 30 కోట్ల ఆదాయానని ఆర్జించింది. దాదాపుగా సున్నా శాతం ఫిర్యాదు రేటుతో రోజుకు 60,000 భోజనాలు అందిస్తున్నాము’’ అని అన్నారు. గతేడాది IRCTC తన ఇ-క్యాటరింగ్ పోర్టల్ ద్వారా న్యూ ఢిల్లీ, ప్రయాగ్‌రాజ్, కాన్పూర్, లక్నో, వారణాసిలోని రైల్వే స్టేషన్‌లలో ప్రీ-ఆర్డర్ చేసిన భోజనాల సరఫరా, డెలివరీని సులభతరం చేయడానికి ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ జొమాటోతో చేతులు కలిపింది.

Exit mobile version