NTV Telugu Site icon

Miss global india: మిస్ గ్లోబల్ ఇండియా కిరీటం సొంతం చేసుకున్న స్వీజల్

Sweezalfurtado

Sweezalfurtado

మిస్ గ్లోబల్ ఇండియా-2024 కిరీటాన్ని బెంగళూరుకి చెందిన స్వీజల్ ఫుర్టాడో సొంతం చేసుకుంది. జూలై 28న జైపూర్‌లోని క్లార్క్స్ అమెర్‌లో జరిగిన మిస్ సూపర్ మోడల్ ఇండియా ఈవెంట్‌లో ఆమెకు పట్టాభిషేకం జరిగింది. అద్భుతమైన పోటీల కెరీర్‌లో ఫుర్టాడోకు ఇది ఒక మైలురాయిగా నిలుస్తుంది.

19 ఏళ్ల స్వీజల్.. అందాల పోటీలు.. మోడలింగ్‌లో రాణిస్తోంది. ఈమె ప్రయాణం ‘ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఇగ్నైట్ ఇండియా 2021’ టైటిల్‌ను గెలుచుకోవడంతో ప్రారంభమైంది. ఆ తర్వాత మిస్ సూపర్ మోడల్ ఇండియా 2022 పోటీలో రెండవ రన్నరప్ స్థానాన్ని కైవసం చేసుకుంది. జూన్ 2023లో ఆమె ప్రపంచ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. పెరూలోని మిస్ టీన్ ఇంటర్నేషనల్ పోటీలో మిస్ టీన్ యూనివర్సల్ 2023, ఇంటర్నేషనల్ ప్రిన్సెస్ టైటిల్‌ను కూడా గెలుచుకుంది. మిస్ టీన్ యూనివర్సల్ ఆసియా మరియు బెస్ట్ నేషనల్ కాస్ట్యూమ్ టైటిళ్లను సొంతం చేసుకుని తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది.

ఇది కూడా చదవండి: CM Chandrababu: దళితులకు ఆర్థిక భద్రత కల్పించే కార్యక్రమాలు చేపట్టండి..

‘సౌత్ ఇండియా సూపర్ మోడల్’గా పేరుగాంచిన స్వీజల్ ప్రతిభావంతులైన నృత్యకారిణి కూడా. ఆమె ‘నాచ్ మేరీ రాణి’ ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతేకాకుండా 2019 లో కవితా ట్రస్ట్ కవితా పఠన పోటీలో కూడా జాతీయ స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం బెంగళూరులోని సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో మూడవ సంవత్సరం BBA విద్యార్థినిగా ఉంది.

ఇది కూడా చదవండి: Paris Olympics 2024: ప్రీ-క్వార్టర్స్‌లోకి భజన్ కౌర్.. క్వార్టర్-ఫైనల్‌కు సాత్విక్-చిరాగ్