NTV Telugu Site icon

Delhi: సీఎం అతిషి ఇంటి ముందు ఎంపీ స్వాతి మాలివాల్ వినూత్న నిరసన

Swathi

Swathi

దేశ రాజధాని ఢిల్లీలో ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ వినూత్న నిరసన చేపట్టారు. ముఖ్యమంత్రి అతిషి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. మురికినీళ్లతో నిండిన బాటిల్‌ను తీసుకొచ్చి ఆమె నిరసన వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రజలకు ఇలాంటి నీళ్లేనా? సరఫరా చేసేదంటూ ఆమె నిలదీశారు. ఈ మేరకు ఆమె మురికినీళ్లకు సంబంధించిన వాటర్‌ను అతిషి ఇంటి ముందు పారబోసి.. బాటిల్ గేటు ముందు పెట్టింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అతిషి వర్సెస్ స్వాతి అన్నట్టుగా మారింది. అయితే బీజేపీ స్వాతి వెనుకుండి కథ నడిపిస్తోందని ఆప్ ఆరోపిస్తోంది.

ఇది కూడా చదవండి: Tirupati Crime: లాడ్జిలో మైనర్‌ బాలికపై అత్యాచారయత్నం.. యువకుడు అరెస్ట్

స్వాతి మాలివాల్‌ మీడియాతో మాట్లాడుతూ.. సాగర్‌పూర్, ద్వారక ప్రజలు తనకు ఫోన్ చేశారని.. దీంతో తాను అక్కడికి వెళ్లానని చెప్పారు. ఆ ప్రాంతాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు. ఓ ఇంటి దగ్గరకు వెళ్లి నల్లా విప్పి బాటిల్ పడితే ఇలాంటి నీళ్లు వచ్చాయని వివరించారు. నల్లాల్లో సరఫరా అవుతున్న నీరు నల్లగా, కలుషితంగా ఉందని చెప్పారు. అదే నీటిని ఇప్పుడు సీఎం అతిషి ఇంటికి తెచ్చినట్లు పేర్కొన్నారు. ఇలాంటి నీటిని ఎవరైనా తాగుతారా?.. వాడుకుంటారా?. ఎన్ని ప్రభుత్వాలు మారినా పేదల కష్టాలు మాత్రం తీరడం లేదని ధ్వజమెత్తారు.

ఇది కూడా చదవండి: Winter: శీతాకాలంలో చిన్నారుల పట్ల తీసుకోవల్సిన జాగ్రత్తలివే!

‘‘ఢిల్లీ ముఖ్యమంత్రికి ఇదే నా హెచ్చరిక. రానున్న 15 రోజుల్లో​ ఢిల్లీలో ప్రతీ ఇంటికి మంచి నీరు అందాలి. లేని పక్షంలో పరిస్థితులు దారుణంగా ఉంటాయి. ఇవే నీటిని ట్యాంకర్‌లో నింపి సీఎం నివాసం దగ్గర పారబోస్తాం. ఇప్పుడు కేవలం ఒక్క బాటిల్‌ నీటిని మాత్రమే వేస్తున్నాను. ఇది కేవలం శాంపిల్‌ మాత్రమే.’’ అని స్వాతి మాలివాల్ వార్నింగ్ ఇచ్చారు.

 

 

Show comments