NTV Telugu Site icon

Swati Maliwal Assault: స్వాతి మలివాల్ దాడి కేసులో వైరల్ అవుతున్న వీడియో..భద్రతా సిబ్బందితో తీవ్ర వాగ్వాదం..

Swati Maliwal Assault Case

Swati Maliwal Assault Case

Swati Maliwal Assault: ఆప్ నేత, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి వ్యవహారం దేశ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆయన పీఏ బిభవ్ కుమార్ ఆమెపై దాడి చేసిన ఘటన సంచనలంగా మారింది. నిన్న ఆమె ఢిల్లీ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. నిందితుడిపై కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్ నివేదిక ప్రకారం.. స్వాతి మలివాల్ 7-8 సార్లు కొట్టడంతో పాటు ఛాతీ, కడుపు భాగంలో తన్నడంతో పాటు సన్నితమైన శరీర భాగాలపై దాడి చేసినట్లు పేర్కొంది.

Read Also: Atrocious: భర్త, అత్తపై కోడలు అరాచకం.. ఇన్సూరెన్స్‌ డబ్బుల కోసం దాడి

ఇదిలా ఉంటే కేజ్రీవాల్ నివాసంలో భద్రతా సిబ్బందితో స్వాతి మలివాల్‌కి జరిగిన వాగ్వాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో గార్డులకు స్వాతి మలివాల్ వార్నింగ్ ఇవ్వడం చూడొచ్చు. “తేరీ భీ నౌక్రీ ఖావుంగీ… యే గంజా సాలా” అని ఆమె చెప్పినట్లు వినవచ్చు. భద్రతా సిబ్బంది ఆమెను అక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. తాను పోలీసులకు ఫోన్ చేస్తానని స్వాతి మలివాల్ చెప్పడం వినొచ్చు. పోలీసులకు ఇక్కడి రారని భద్రతా సిబ్బంది చెప్పడం కనిపిస్తోంది.

వైరల్ అవుతున్న వీడియోపై మలివాల్ స్పందిస్తూ.. ‘‘తనను తాను రక్షించుకోవడానికి ‘‘రాజకీయ హిట్‌మ్యాన్’’ ప్రయత్నాలు ప్రారంభించారు. తన వ్యక్తులను ట్వీట్ చేయడం, సగం సందర్భం లేని వీడియోలను అమలు చేయడం ద్వారా అతను నేరం చేసిన తర్వాత తప్పించుకోగలనని అతను భావిస్తున్నాడు. ఒకరిన కొట్టేటప్పుడు వీడియో ఎవరు తీస్తారు..? ఒక్కసారి ఇంటిలోపల సీసీటీవీ ఫుటేజీ చూస్తే అందరికి నిజం తెలుస్తుంది’’ అని ఆమె ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.