Swara Bhaskar: చంపేస్తామంటూ వార్నింగ్ లెటర్.. ఆ వ్యాఖ్యలు చేసినందుకే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెలెబ్రిటీలు ఏం మాట్లాడినా ఆచితూచి వ్యవహరించాలి. ముఖ్యంగా.. వివాదాస్పద అంశాలకు ఎంత దూరంగా ఉంటే, అంతే మంచిది. ఒకవేళ ఏదైనా అభిప్రాయాన్ని వ్యక్తపరచాలనుకుంటే, అది అవతలివారి మనోభావాల్ని దెబ్బతినకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే.. లేనిపోని సమస్యల్లో చిక్కుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు బాలీవుడ్ నటి స్వర భాస్కర్‌కు అలాంటి పరిస్థితే వచ్చిపడింది. ఈమెకు ఏకంగా చంపేస్తామంటూ బెదిరింపు లేఖ వచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో అంశంపై స్పందిస్తూ వార్తల్లోకెక్కే స్వర భాస్కర్.. 2017లో వీర్ సావర్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసింది. తనను జైలు నుంచి విడిపించాలని వీర్ సావర్కర్ బ్రిటీష్ ప్రభుత్వాన్ని వేడుకున్నాడని, అది వీరత్వం ఎలా అవుతుందంటూ ఆమె ట్వీట్ చేసింది. అప్పట్లో ఈ ట్వీట్ పెద్ద దుమారమే రేపింది. వీర్ సావర్కర్ అభిమానులు ఆమెపై ఓ రేంజ్‌లో విమర్శలు గుప్పించారు. ఆ సమయంలో పెద్ద రచ్చే జరిగింది. ఇప్పుడు ఆ అంశం మీదే స్వర భాస్కర్ ఇంటికి బెదిరింపు లేఖ వచ్చింది.
Also Read
- TMC Crisis: బెంగాల్ రాజకీయాల్లో సంచలనం.. ‘‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ’’లో టీఎంసీ ఎంపీలు విలీనం..
- Ship sink: ఒమన్ తీరంలో మునిగిన షిప్.. 14 మంది భారతీయులకు తప్పిన ప్రమాదం..
- Madhya Pradesh: ప్రాణాలు తీసిన వదంతి.. రైలు నుంచి దూకిన ప్రయాణికుల్ని ఢీకొట్టిన మరో రైలు..
- PM Modi: భారత్ రండి, మాతో కలిసి పని చేయండి.. మోడీ పిలుపు..
మహారాష్ట్రలోని వెర్సోవాలో ఉన్న స్వర భాస్కర్ నివాసానికి స్పీడ్ పోస్ట్ ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు ఈ బెదిరింపు లేఖ పంపారు. వీర్ సావర్కర్‌ను అవమానిస్తే దేశ యువత ఏమాత్రం సహించబోదని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖపై ఆమె పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా.. కొన్ని రోజుల క్రితం సల్మాన్ ఖాన్‌కు కూడా ఓ బెదిరింపు లేఖ వచ్చిన సంగతి విదితమే!
తాజావార్తలు
-
RAAKA : పుష్ప ప్యాట్రన్ ఫాలో అవుతున్న ‘రాకా’.. రిలీజ్ ఎప్పుడంటే?
-
Vaibhav Suryavanshi: ఒకరి తర్వాత ఒకరు.. 100 ఓవర్లు.. వైభవ్ కష్టాన్ని కళ్ళకు కట్టిన కోచ్!
-
Fatima Sana: ఆధిపత్యం మాదే, మేమే గెలవాల్సింది.. కానీ అదే మా కొంపముంచింది!
-
Specialized Levo 4X: 840Wh బ్యాటరీతో స్పెషలైజ్డ్ లెవో 4X ఈ-బైక్ విడుదల.. 4.4 గంటల రైడింగ్, ధర ఎంతంటే?
-
Ind W Vs Pak W: హనుమంతుడు వల్లే గొప్పగా రాణించా.. మ్యాచ్ తర్వాత దీప్తి శర్మ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: నా చేతిలో ఉంటేనా.. రిచా ఘోష్ బ్యాటింగ్‌పై హర్మన్‌ప్రీత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kitchen Hacks : నాన్-స్టిక్ అవసరమే లేదు.. ఈ ట్రిక్‌తో స్టీల్ పాత్రలే సూపర్.!
-
Child Safety Tips : స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి.. పిల్లలకు ఈ 5 ‘అబద్ధాలు’ నేర్పించండి..!
-
Cleaning Hacks : పరుపు, దిండు నుంచి వాసన వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో ఫ్రెష్.!
-
Kitchen Tips : బియ్యాన్ని ఇలా కడగకపోతే అన్నం రుచి, ఆరోగ్యం రెండూ దెబ్బే.!