Site icon NTV Telugu

Monkeypox: అనుమానాస్పద మంకీపాక్స్ కేసు చికెన్‌పాక్స్‌గా నిర్ధారణ.. ఎక్కడో తెలుసా?

Monkeypox

Monkeypox

Monkeypox: ప్రపంచాన్ని మంకీపాక్స్‌ వైరస్ భయాందోళనకు గురి చేస్తోంది. మనదేశంలో కూడా ఇప్పటివరకు నాలుగు మంకీపాక్స్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. వాటిలో మూడు కేసులు కేరళలో వెలుగు చూశాయి. మరొకటి ఢిల్లీలో వెలుగు చూసింది. కర్ణాటకలోని బెంగళూరు విమానాశ్రయంలో మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్లు అనుమానించిన ఇథియోపియన్ పౌరుడికి మంకీపాక్స్‌కు బదులుగా చికెన్‌పాక్స్ ఉన్నట్లు నిర్ధారించబడింది. కర్ణాటక ఆరోగ్య మంత్రి కె.సుధాకర్ ప్రకారం.. ఇథియోపియన్ పౌరుడు ఈ నెల ప్రారంభంలో మంకీపాక్స్ లక్షణాలతో బెంగళూరు విమానాశ్రయంలో దిగగా.. అతనిని పరీక్షల కోసం పంపించారు. రిపోర్టులో అది చికెన్‌పాక్స్‌గా నిర్ధారించబడిందని ఆయన ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు.

Jammu Kashmir: కాశ్మీర్ లో మరో ఎన్ కౌంటర్.. లష్కర్ ఉగ్రవాది హతం

మంకీపాక్స్ బాధిత దేశాల నుంచి కర్ణాటకకు వచ్చే ప్రయాణికుల్లో మంకీపాక్స్ లక్షణాలు గల వారికి పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ వెల్లడించారు. మంకీపాక్స్ అనేది ఒక అరుదైన వైరల్ వ్యాధి. ఇది ప్రధానంగా మధ్య, పశ్చిమ ఆఫ్రికాలో సంభవిస్తుంది. దాని అంటువ్యాధులు చాలా వరకు రెండు నుంచి నాలుగు వారాల పాటు ఉంటాయి. శోషరస కణుపుల వాపు, శరీరంపై విస్తృతమైన దద్దుర్లు ఏర్పడతాయి. పలు దేశాల్లో మంకీపాక్స్ కేసులు పెరుగుతుండగా.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. మంకీపాక్స్ అనుమానిత లక్షణాలు గల వారికి పరీక్షలను పెంచింది.

Exit mobile version