Site icon NTV Telugu

Manipur Violence: మయన్మార్ నుంచి మణిపూర్‌లోకి 300 మంది ఉగ్రవాదులు.. రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ హెచ్చరిక..

Manipur Violence

Manipur Violence

Manipur Violence: జాతుల సంఘర్షణతో మణిపూర్ రాష్ట్రం అట్టుడుకుతోంది. మైయిటీ, కూకీ వర్గాల మధ్య ఘర్షణ కారణంగా ఇప్పటి వరకు 80 మందికి పైగా ప్రజలు మరణించారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న మణిపూర్ వెళ్లారు. శాంతి స్థాపన కోసం పలు పార్టీలతో సంభాషించారు. మరోవైపు తిరుగబాటుదారుల ముగుసులో ఉగ్రవాదులు గ్రామాలు, ప్రజలపై దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా మణిపూర్ సరిహద్దును అనుకుని ఉన్న మయన్మార్ నుంచి పెద్ద ఎత్తున ఉగ్రవాదులు రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ హింసకు ఉగ్రవాదులు కారణం అవుతున్నారు. గ్రామాలపై దాడులు చేయడానికి తిరుగుబాటుదారులను ఉపయోగించుకుంటున్నట్లు మైయిటీలు, కుకీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. శాంతిని నెలకొల్పడానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మరియు భద్రతా దళాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. మణిపూర్‌లో శాంతి మరియు సాధారణ స్థితిని తీసుకురావడంలో పాల్గొన్న ఇంటెలిజెన్స్ అధికారులు ఈ రోజు ఇంఫాల్ లో సమావేశం అవుతున్నారు.

Read Also: Medical Colleges Lose Recognition: 150 మెడికల్‌ కాలేజీలకు గుర్తింపు రద్దు!.. ప్రతిపాదనలు రెడీ

ఇదిలా ఉంటే మయన్మార్ నుంచి లుంగీలు ధరించిన వారితో సహా 300 మంది ఉగ్రవాదులు మణిపూర్(భారత్)లోకి మయన్మార్ నుంచి చొరబడినట్లు లెఫ్టినెంట్ జనరల్ ఎల్ నిషికాంత సింగ్ (రిటైర్డ్) హెచ్చరిస్తూ ట్వీట్ చేశారు.. ప్రధాని నరేంద్రమోడీ, రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్, భారత సైన్యాన్ని ట్యాగ్ చేశారు. లుంగీలు ధరించడాన్ని మయన్మార్ సరిహద్దుల్లోని తిరుగుబాటుదారులను సూచిస్తుంది. వారు పౌరుల మాదిరిగానే లుంగీలు ధరిస్తారు. వీరంతా మయన్మార్ మిలిటరీ జుంటా ఆధ్వర్యంలో పనిచేస్తుంటారు. లెఫ్టినెంట్ జనరల్ సింగ్ 40 ఏళ్ల పాటు ఇండియన్ ఆర్మీలో పనిచేసి 2018లో పదవీ విరమణ చేశారు. అతను ఇంటెలిజెన్స్ కార్ప్స్‌లో కూడా ఉన్నాడు. మణిపూర్ రాష్ట్రం మయన్మార్ తో 400 కిలోమీటర్ల సరిహద్దు పంచుకుంటుంది. దీంట్లో కేవలం 10 శాతం కంటే తక్కువగా కంచె నిర్మించారు. మణిపూర్ మయన్మార్, లావోస్, థాయ్ లాండ్ సరిహద్దుల ట్రైజంక్షన్ అయిన ‘గోల్డెన్ ట్రయాంగిల్’. ఇక్కడ నుంచి ఈశాన్య భారతంలోకి డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి.

మణిపూర్ లో మెజారిటీ ప్రజలైన మైయిటీలకు గిరిజన గుర్తింపు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ.. మే 3న కుకీలు ‘గిరిజన సంఘీభావ ర్యాలీ’ చేశారు. ఈ ర్యాలీలో హింస మొదలై క్రమక్రమంగా రాష్ట్రం మొత్తానికి విస్తరించింది. ఇరువర్గాలు ఇళ్లు దహనం చేయడంతో పాటు దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 80 మంది మరణించారు. పరిస్థితిని అదుపు చేయడానికి సైన్యాన్ని రాష్ట్రంలో మోహరించారు.

https://twitter.com/VeteranLNSingh/status/1663420206935597056

Exit mobile version