NTV Telugu Site icon

Survey on Romance: ‘రొమాన్స్’పై ఇండియాలో తొలిసారిగా సర్వే. అమ్మాయిలు ఇన్నోసెంట్‌. అబ్బాయిలు రొమాంటిక్‌

Survey On Romance

Survey On Romance

Survey on Romance: నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే(ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌)-5లో తాజాగా పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. 2019-21 మధ్య కాలంలో నిర్వహించిన ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌-5లో భాగంగా మన దేశంలో తొలిసారిగా శృంగారంపై సర్వే చేశారు. రొమాన్స్‌లో కండోమ్‌ వాడకంపైనా అధ్యయనం చేశారు. ఈ పరిశోధన ఫలితాల ప్రకారం.. వయసులో ఉన్న ప్రతి వంద మంది మహిళల్లో కేవలం 2 శాతం మందే గతేడాది రొమాన్స్‌లో పాల్గొన్నారు. అదే.. మగాళ్లయితే 13.4 శాతం మంది శృంగారాన్ని ఎంజాయ్‌ చేశారు. 23-24 ఏళ్ల వయసు అమ్మాయిల్లో 95.3 శాతం మంది ఇప్పటివరకు ఒక్కసారి కూడా రొమాన్స్‌ జోలికి పోలేదు. అబ్బాయిల విషయానికి వచ్చేసరికి ఈ పర్సంటేజీ 77 శాతం మాత్రమే కావటం గమనార్హం.

15-24 ఏళ్ల వయసులోని పెళ్లికాని ప్రసాదుల(పురుషుల)తో పోల్చితే పెళ్లికాని ఆడవాళ్లు సేఫ్‌ రొమాన్స్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు. 15-19 ఏళ్ల మధ్య వయసు అమ్మాయిల్లో 1.3 శాతం మందే గత 12 నెలల్లో శృంగారంలో పాల్గొన్నారు. అబ్బాయిలు మాత్రం 4.4 శాతం మంది ఈ అనుభవాన్ని పొందారు. ఈ సర్వేలో భాగంగా దేశవ్యాప్తంగా 707 జిల్లాల్లోని 6 లక్షలకు పైగా ఇళ్లకు తిరిగి అభిప్రాయాలను సేకరించారు. టీనేజ్‌ అమ్మాయిల కన్నా టీనేజ్‌ అబ్బాయిలే రొమాన్స్‌ విషయంలో బాగా యాక్టివ్‌గా ఉన్నారు. 0.9 శాతం మంది టీనేజ్‌ గర్ల్స్‌ మాత్రమే శృంగారం గురించి ప్రాక్టికల్‌గా తెలుసుకోగా యుక్త వయసు అబ్బాయిలు మాత్రం 2.9 శాతం మంది రొమాన్స్‌ పట్ల అమితాసక్తి ప్రదర్శించారు.

Disney Follows Amazon Prime: అమేజాన్‌ ప్రైమ్‌ బాటలో డిస్నీ. సబ్‌స్క్రిప్షన్‌ సర్వీసుల ప్రారంభానికి కసరత్తు

గత సంవత్సర కాలంగా 18-19 ఏళ్ల వయసు అమ్మాయిల్లో 1.9 శాతం మందికే లైంగిక సంపర్కం జరగగా ఈ శాతం అబ్బాయిల్లో 6.6 శాతానికి పెరిగింది. పెళ్లికానివాళ్లలోని 20-24 ఏజ్‌ గ్రూప్‌ అమ్మాయిలైతే 1.9 శాతం మందే శారీరకంగా పురుషులతో కలిశారు. సింగిల్‌ మెన్‌ మాత్రం 11.8 శాతం మంది అమ్మాయిలతో పడక సుఖాన్ని సొంతం చేసుకున్నారు. 20-22 ఏజ్‌ గ్రూప్‌లో సైతం అమ్మాయిల పర్సంటేజీ ఇదే అత్యల్ప స్థాయిలో ఉంది. అబ్బాయిల శాతం 10.9కి చేరింది. అమ్మాయిలు యుక్త వయసులో ఉన్నా వయోజనులైనా రొమాన్స్‌లో పాల్గొనేటప్పుడు కండోమ్‌ వాడకానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. 15-19 ఏజ్‌ గ్రూప్‌లో 57 శాతం మంది అబ్బాయిలే కండోమ్‌ వాడుతుండగా అమ్మాయిలు మాత్రం 61.2 శాతం మంది ఈ రక్షా కవచాన్ని ధరిస్తుండటం గమనార్హం.

కండోమ్‌ విషయంలో 20-24 ఏజ్‌ గ్రూప్‌కి వచ్చే సరికి అబ్బాయిలో కాస్త అవగాహన పెరిగినట్లు అర్థమవుతోంది. ఈ వయసువాళ్లు 64 శాతం మంది కండోమ్‌ యూజ్‌ చేస్తున్నారు. అమ్మాయిలైతే 65.3 శాతం మంది ఈ విధంగా ముందుజాగ్రత్త పడుతున్నారు. పైన పేర్కొన్న అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటే 15-24 ఏజ్‌ గ్రూప్‌లో అబ్బాయిల కన్నా అమ్మాయిలే అమాయకులని, వర్జిన్లని తేలింది. 15-19 ఏజ్‌ గ్రూపుల్లో ఏకంగా 97 శాతానికి పైగా గర్ల్స్‌ వర్జిన్లు కాగా బాయ్స్‌ మాత్రం 93.8 శాతం మందే వర్జిన్లు. 15-17 ఏజ్‌ గ్రూప్‌లో అబ్బాయిల పర్సంటేజీ 96.1కి పెరిగింది. 20-24 ఏజ్‌ గ్రూప్‌కి వచ్చే సరికి వర్జిన్‌ అమ్మాయిల శాతం 2 శాతం తగ్గింది. అబ్బాయిల్లో వర్జిన్ల పర్సంటేజీ 80కి పడిపోయింది.