Site icon NTV Telugu

Non-Veg Party in School: స్కూల్లో చికెన్, మటన్ తోని దావత్.. ప్రిన్సిపాల్ సస్పెన్షన్…

Untitled Design (9)

Untitled Design (9)

ప్రభుత్వ పాఠశాల ఆవరణలో జరిగిన మాంసాహార పార్టీ తీవ్ర వివాదానికి దారితీసింది. దీనితో ప్రిన్సిపాల్ సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ ఘటన గుజరాత్ లోని సూరతో ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. గొదాదర ప్రాంతంలోని ప్రాథమిక పాఠశాలలో జరిగిన ఒక సమావేశంలో ప్రజలు చికెన్, మటన్ పదార్థాలు తింటున్న వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ కావడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.

Read Also: Women Cricketers : బుర్ఖా ధరించి క్రికెట్ పిచ్ లోకి మహిళా క్రికెటర్లు..

పూర్తి వివరాల్లోకి వెళితే.. చదువు చెప్పే ప్రభుత్వ పాఠశాల పార్టీకి వేదికగా మారింది. చికిన్, మటన్ వంటి ఆహారంతో నాన్ వెజ్ పార్టీ చేసుకున్నారు. ఈ సమయంలో స్కూల్ లో ఉన్న సరస్వతి దేవి విగ్రహానికి కండువా కప్పారు. ఇందులో మరో విషయం ఏంటంటే.. పార్టీ కోసం ఏర్పాటు ఫ్లెక్సీ తెలుగులో ఏర్పాటు చేశారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో వివాదానికి దారితీసింది. దీంతో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఎలాంటి అనుమతి లేకుండా ఆవరణలో నాన్-వెజ్ పార్టీని నిర్వహించినందుకు ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేసినట్లు సోమవారం ఒక అధికారి తెలిపారు. ఆయనపై శాఖాపరమైన విచారణ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని వెల్లడిచారు.

Read Also: Bike Accident: ట్రాక్ పై పడిపోయిన యువకుడు.. అనుకోకుండా వెనుక నుంచి రైలు…

ఆదివారం మధ్యాహ్నం ఈ సమావేశం జరిగిందని, పాఠశాల ప్రధాన ద్వారం మీద ఉన్న 1987, 1991 మధ్య కాలంలో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఈ పార్టీ నిర్వహించినట్లు సమాచారం. ఈ నాన్-వెజ్ విందు వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాథమిక విద్యా కమిటీ సాయంత్రం దర్యాప్తుకు ఆదేశించింది. దర్యాప్తు ఫలితాల ఆధారంగా, పాఠశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్ ఎలిగాటిన్‌ను సస్పెండ్ చేయాలని పిఇసి ఆదేశించిందని అధికారి తెలిపారు.

 

Exit mobile version