ముంబై మున్సిపల్ ఎన్నికలు జనవరి 15న జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. ఇక ఇటీవల జరిగిన మహారాష్ట్రలోని స్థానిక ఎన్నికల్లో ఇండియా కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. సరైన ఫలితాలు రాబట్టలేక చతికిలబడింది. ఈ నేపథ్యంలో శివసేన (యూబీటీ) అప్రమత్తం అయింది. బుధవారం సోదరుడు రాజ్ థాక్రే పార్టీతో ఉద్ధవ్ థాక్రే పొత్తు పెట్టుకున్నారు. ఇద్దరూ ఉమ్మడి ప్రకటన చేశారు. ముంబై మేయర్ పదవికి దక్కించుకుంటామని ప్రకటించారు. అయితే ఈ పొత్తును కాంగ్రెస్ వ్యతిరేకించింది. రాజ్ థాక్రేతో కలిసి పని చేయలేమన్నట్టుగా సంకేతాలు ఇచ్చింది.
ఇది కూడా చదవండి: Cambodia: కంబోడియాలో విష్ణువు విగ్రహం కూల్చివేత.. భారత్ అభ్యంతరం
తాజాగా ఉద్ధవ్ థాక్రేతో పొత్తుపై ఎస్‌సీపీ ఎంపీ సుప్రియా సూలే స్పందించారు. ప్రస్తుతానికి పొత్తులపై చర్చలు జరగలేదని.. కచ్చితంగా పొత్తుల కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఇప్పటి వరకైతే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పుకొచ్చారు. కచ్చితంగా అయితే పొత్తుల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
ఇక అనేక విషయాలపై మాట్లాడారు. ఢిల్లీ కాలుష్యంపై చర్చించాలని కోరితే.. దురదృష్టవశాత్తు అది జరగలేదన్నారు. ఇక 2017 ఉన్నావ్ అత్యాచార కేసులో నిందితుడైన కుల్దీప్ సింగ్ సెంగార్ శిక్షను ఢిల్లీ హైకోర్టు నిలిపివేయడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ విషయంలో మానవత్వం అవసరం అన్నారు. ఇది దేశ కుమార్తెకు సంబంధించిన ప్రశ్న అని.. ఆమెకు అండగా నిలబడతామని… ఇంత నీచమైన వ్యక్తికి బెయిల్ ఎలా లభిస్తుంది? అని ప్రశ్నించారు. ఇక బంగ్లాదేశ్ వ్యవహారంలో ప్రభుత్వానికి అండగా ఉంటామని చెప్పారు.
#WATCH | Pune, Maharashtra: NCP-SCP MP Supriya Sule says, "Delhi pollution is a huge crisis and we asked for a discussion in Parliament on air pollution, but it couldn't happen, unfortunately."
On the Delhi High Court suspending the sentence of Kuldeep Singh Sengar, the accused… pic.twitter.com/eq2W0CveT5
— ANI (@ANI) December 25, 2025