NTV Telugu Site icon

Karnataka hijab row: దుస్తులు ధరించే హక్కు ఉంటే.. విప్పే హక్కు కూడా ఉందా..? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Supreme Court On Hijab

Supreme Court On Hijab

Supreme Court on Hijab Controversy: కర్ణాటక రాష్ట్రంలో హిజాబ్ వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. పాఠశాలల్లో హిజాబ్ నిషేధిస్తూ అక్కడి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ పలువురు కర్ణాటక హైకోర్టుకు వెళ్లగా.. హైకోర్టు కూడా విద్యాసంస్థల్లో తప్పకుండా యూనిఫామ్ ధరించాల్సిందే అని స్పష్టం చేసింది. దీంతో పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా హిజాబ్ వివాదంపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. దీనిపై కీలక వ్యాఖ్యలు చేసింది.

దుస్తులు ధరించే హక్కు ఉంటే.. విప్పే హక్కు కూడా ఉన్నట్లేనా అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్టికల్ 19(1)ప్రకారం భావప్రకటన స్వేచ్ఛ హక్కుల్లో దుస్తులు ధరించే హక్కు ఒక భాగమని.. అంతకు ముందు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు పిటిషన్ల తరుపు న్యాయవాది దేవదత్ కామత్. వాదనల్లో భాగంగా దీనిపై స్పందించిన జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాంశు ధూలియా ద్విసభ్య ధర్మాసనం ఈ వ్యాక్యలు చేసింది. అయితే నేను అలా అనడం లేదని.. పాఠశాలల్లో ఎవరూ బట్టలు విప్పడం లేదని దేవదత్ కామత్ బదులిచ్చారు. గతంలో 19(1) ప్రకారం భావవ్యక్తీకరణ హక్కును నల్సా కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును గుర్తు చేశారు పిటిషన్ల తరుపు న్యాయవాది. ముస్లిం బాలికలు తలపై వస్త్రం కప్పుకోవడానికి అనుమతినిస్తూ కేంద్రీయ విద్యాలయాలు జారీ చేసిన ఉత్తర్వులను ఆయన ప్రస్తావించారు.

Read Also: Heavy Rains: బీ అలర్ట్.. దక్షిణాదికి భారీ వర్ష సూచన

అయితే ఇక్కడ హిజాబ్ ధరించడాన్ని ఎవరూ నిషేధించలేదని.. మీరు దాన్ని కావాల్సిన చోట ధరించవచ్చని.. పాఠశాలల్లో మాత్రమే ఆంక్షలు ఉన్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం హిజాబ్ పై నిషేధాన్ని విధించిందని న్యాయవాది దేవదత్ కామత్ సుప్రీంకోర్టులో వాదించారు. అయితే దీనికి ధర్మాసనం.. ఇది సరైనది కాకపోవచ్చే అనుమానం వ్యక్తం చేసింది. ఎందుకంటే ఓ వర్గం మాత్రమే తలపై వస్త్రం కప్పుకుని రావాలనుకుంటోంది.. మరో వర్గం పాఠశాల దుస్తులను ధరిస్తూ నిబంధనలను పాటిస్తోందని వ్యాఖ్యానించింది. దీనిపై విచారణను గురువారానికి వాయిదా వేసింది.