Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Supreme Court Verdict On Maharashtra Political Crisis

Maharashtra Politics : రెబల్‌ ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టులో ఊరట..

Published Date :June 27, 2022 , 5:28 pm
By Gogikar Sai Krishna
Maharashtra Politics : రెబల్‌ ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టులో ఊరట..
  • Follow Us :
  • google news
  • dailyhunt

మహారాష్ట్రలో మహా రాజకీయం జరుగతోంది. రాజకీయ సంక్షోభంతో మహారాష్ట్రలో రాజకీయం వేడెక్కింది. అయితే శివసేన రెబల్‌ ఎమ్మెల్యేతో కొత్ పార్టీని ఏర్పాటు చేస్తామని, మాదే అసలైన శివసేన అంటూ రెబల్‌ ఎమ్మెల్యేల నాయకుడు ఏక్‌నాథ్‌ షిండే ప్రకటనలు చేశారు. అంతేకాకుండా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో డిప్యూటీ స్పీకర్‌ నరహరి జిర్వాల్ అనర్హత వేటు వేశారు. అయితే ఈ నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ ఆ నోటీసులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఏక్‌నాథ్‌షిండే సహా 16 రెబల్‌ ఎమ్మెల్యేలకు ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు రెబల్‌ ఎమ్మెల్యేకు మద్దతుగా ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా బాంబే హైకోర్టును ఎందుకు ఆశ్రయించలేదని ఏక్‌నాథ్ షిండే వర్గాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అయితే తమ ప్రాణాలకు ముప్పు ఉందని, ముంబైలో న్యాయపరమైన పరిష్కారాలను కొనసాగించేందుకు వాతావరణం అనుకూలంగా లేదని ఆ వర్గం తెలపడమే కాకుండా.. వారికి నోటీసులు జారీ చేసే అధికారం డిప్యూటీ స్పీకర్‌కు లేదని షిండే తరపున వాదనలు వినిపిస్తున్న నీరజ్ కిషన్ కౌల్ కోర్టుకు వివరించారు.

రెబల్ ఎమ్మెల్యేల ఇళ్లు, ఆఫీసులపై దాడులు జరుగుతున్న విషయం గురించి కూడా కోర్టుకు తెలిపారు. ఈ వాదనలు విన్న సుప్రీంకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వానికి, డిప్యూటీ స్పీకర్‌, మహారాష్ట్ర అసెంబ్లీ సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది. ఐదు రోజుల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. ఆ తర్వాత మూడు రోజుల్లోగా రిజాయిండర్‌ దాఖలు చేయాలని తెలిపింది సుప్రీంకోర్టు. అంతేకాదు.. జూన్ 27 సాయంత్రం 05.30 లోపు అనర్హత నోటీసులపై సమాధానం ఇవ్వాలని రెబల్ ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన గడువును సుప్రీం కోర్టు జులై 12 వరకూ పొడిగించింది. తదుపరి విచారణ జులై 11కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అంతేకాకుండా రెబల్ ఎమ్మెల్యేలకు భద్రత కల్పించాలని, ఎమ్మెల్యేలకు, వారి కుటుంబ సభ్యులకు, ఆస్తులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • eknath shinde
  • Maharashtra political crisis
  • Supreme Court
  • Uddhav Thackeray

తాజావార్తలు

  • S.S.Thaman: త్రివిక్రమ్ నా గురువు.. వచ్చే సినిమాతో ఆస్కారే లక్ష్యం!

  • Telangana Budget: ఆరు గ్యారెంటీలకు రూ.50,713 కోట్లు.. మూసికి రూ.1500 కోట్లు

  • Telangana Budget: సామాన్యులకు గుడ్‌న్యూస్.. ప్రతి ఫ్యామిలీ సేఫ్టీకి రూ.5 లక్షలు.. బడ్జెట్‌లో 5 కొత్త పథకాలు ఇవే..

  • S.S.Thaman: తమన్ ప్రయాణం.. ‘బాయ్స్’ నుంచి ‘ఓజీ’ వరకు.. మైలురాళ్లు ఇవే!

  • ATM Withdraw: రూ.10 వేలు విత్‌డ్రా చేస్తే రూ.3 లక్షలొచ్చాయి. అసలు కథేంటంటే..!

ట్రెండింగ్‌

  • Gut Health : పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.!

  • Gym Tips : జిమ్ మధ్యలో మానేస్తే మీ బాడీకి ఇదే జరుగుతుంది.! ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి.!

  • Butter Curd Rice : హెల్తీ, రుచికరమైన బటర్ కర్డ్ రైస్.. ఇలా సింపుల్ గా తయారు చేసుకోండి..!

  • IPL 2026 Injury List: గాయాల దెబ్బ, స్టార్ ప్లేయర్స్ ఔట్.. ఐపీఎల్ జట్లకు భారీ షాక్!

  • Summer Super Drinks : బాదం షర్బత్ ట్రై చేశారా..? ఎండలో కూల్‌గా ఉండే సూపర్ డ్రింక్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions