NTV Telugu Site icon

Supreme Court: ఈడీని సమర్థిస్తూ సుప్రీం కోర్టు కీలక తీర్పు

Supreme Court

Supreme Court

Supreme Court key judgment on Anti-Money Laundering Cases: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు మద్దతు ఇస్తూ సుప్రీం కోర్టు కీలక తీర్పును బుధవారం వెలువరించింది. ఈడీ అరెస్ట్ చేసే అధికారంలో పాటు ఈడీకి వ్యతిరేకంగా లేవనెత్తిన అన్ని అభ్యంతరాలను సుప్రీంకోర్టు తిరస్కరించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం( పీఎంఎల్ఏ)లోని నేర పరిశోధన, అరెస్ట్ అధికారం, ఆస్తుల అటాచ్మెంట్ మొదలైన నిబంధనలను సుప్రీంకోర్టు సమర్థించింది. మనీలాండరింగ్ అరెస్టులు ‘‘ఏకపక్షం’’ కానది సంచలన ఉత్తర్వుల ఇచ్చింది.

అరెస్టుకు గల కారణాలను, సాక్షాధారాలను తమకు తెలియకుండా నిందితులను అరెస్ట్ చేసే అధికారం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ల వాదించారు. విచారణ సమయంలో నిందితుడి నుంచి ఈడీ దోహపూరిత వాంగ్మూలాన్ని నమోదు చేయడం కూడా చట్టవ్యతిరేకం అని పిటిషనర్ల తరుపున వాదనలు వినిపించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఇసిఐఆర్)ని ఎఫ్‌ఐఆర్‌తో పోల్చలేమని.. ఇసిఐఆర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అంతర్గత పత్రమని సుప్రీంకోర్టు పేర్కొంది. నిందితులకు ఇసిఐఆర్ ఇవ్వడం తప్పనిసరి కాదని.. అరెస్టు సమయంలో కారణాలను మాత్రమే బహిర్గతం చేస్తే సరిపోతుందని సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

కేంద్రం తరుపున వాదనలు వినిపించిన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహాతా మనీలాండరింగ్ నేరాల తీవ్రతను సుప్రీంకోర్టుకు తెలిపారు. మనీలాండరింగ్ నిరంతర నేరమని ఆయన కోర్టుకు వివరించారు. ఇటీవల మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ)లో కొన్ని నిబంధనలను సవాల్ చేస్తూ కార్తీ చిదంబరం, జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీతో పాటు మరికొంత మంది పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈరోజు సుప్రీంకోర్టు ఈడీకి అనుకూలంగా కీలక తీర్పును వెల్లడించింది. మనీలాండరింగ్ కేవలం విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటి అవినీతి వ్యాపారుల ద్వారానే కాకుండా ఉగ్రవాద గ్రూపుల ద్వారా కూడా నిర్వహించబడుతోందని.. మనీలాండరింగ్ దేశ సమగ్రతకే కాకుండా సార్వభౌమాత్వానికి ముప్పు కలిగిస్తుందని పీఎంఎల్ఏ నిబంధనలను సమర్థించింది.