Site icon NTV Telugu

Waqf Amendment Act: నేడు వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టులో విచారణ..

Waqf

Waqf

Waqf Amendment Act: వక్ఫ్ సవరణ చట్టం 2025 రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఈరోజు (మంగళవారం) విచారించనుంది. ఈ విషయంలో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. అయితే, మే 15వ తేదీన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం విచారణను మే 20కి వాయిదా వేసింది. ఈ సందర్భంగా మూడు అంశాలపై మధ్యంతర ఆదేశాలు జారీ చేయడానికి వాదనలు వింటామని పేర్కొంది.

Read Also: Corona Cases: భారత్‌లో 257 కరోనా కేసులు.. కేంద్ర ఆరోగ్య శాఖ ఏం చెప్పిందంటే?

ఇక, మొదటి సమస్య ‘వక్ఫ్ బై యూజర్'(వక్ఫ్ బై డీడ్) ద్వారా వక్ఫ్‌గా ప్రకటించబడిన ఆస్తుల డీనోటిఫికేషన్‌కు సంబంధించినది. కాగా, పిటిషనర్లు లేవనెత్తిన రెండవ అంశం రాష్ట్ర వక్ఫ్ బోర్డులు మరియు కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ కూర్పుకు సంబంధించినది. ఇక, మూడవ అంశం ఏమిటంటే, కలెక్టర్ ఆ ఆస్తి ప్రభుత్వ భూమి అవునా కాదా అని నిర్ధారించడానికి విచారణ చేస్తున్నప్పుడు, ఆ ఆస్తిని వక్ఫ్‌గా పరిగణించరు అనే నిబంధనకు సంబంధించినది. అలాగే, ఎక్స్-అఫిషియో సభ్యులు తప్ప, ముస్లింలు మాత్రమే దీనిని నడపాలని ముస్లీం సంఘాల తరపు పిటిషనర్లు వాదిస్తున్నారు. అయితే, గత విచారణలో సుప్రీంకోర్టుకు సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, వక్ఫ్ బోర్డులలో ముస్లిమేతర సభ్యులను నియమించబోమని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది.

Exit mobile version