NTV Telugu Site icon

Afzal Khan’s Tomb Issue: అఫ్జల్ ఖాన్ సమాధి కూల్చివేతపై సుప్రీంకోర్టులో పిటిషన్

Afzal Khan Tomb Issue

Afzal Khan Tomb Issue

Supreme Court To Hear Plea To Stay Demolition Of Afzal Khan’s Tomb: మహారాష్ట్ర సతారా జిల్లాలోని ప్రతాప్ గఢ్ లోని అఫ్జల్ ఖాన్ సమాధి కూల్చివేతపై స్టే విధించాలని కోరుతూ.. హజ్రత్ మహమ్మద్ అఫ్జల్ ఖాన్స్ మెమోరియల్ సొసైటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సమాధికి ఎలాంటి నష్టం కలగకుండా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని సుప్రీంకోర్టును కోరారు. దీనిపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారిస్తామని తెలిపింది. ఈ విషయాన్ని న్యాయవాది నిజాం పాషా, సుప్రీంకోర్టులో ప్రస్తావించారు. దీనిపై రేపు విచారణ జరుపుతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ జేబీ పార్దీవాలాతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

Raed Also: Vishwak Sen: బలుపు తగ్గలేదు.. మరో బూతు పదంతో ‘ధమ్కీ’ ఇచ్చిన మాస్ కా దాస్

గురువారం అఫ్జల్ ఖాన్ సమాధి చుట్టూ ఉన్న అనధికార నిర్మాణాలను కూల్చివేస్తారని సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఈ కూల్చివేతకు సంబంధించిన లైవ్ కవరేజీని స్థానిక ఆన్‌లైన్ న్యూస్ ఛానెల్ ప్రసారం చేసింది. దీంట్లో కొన్ని చోట్ల కొంత మంది నిచ్చెనలతో సమాధిపైకి ఎక్కుతూ కనిపించారు. దీనిని చూపిస్తూ సమాధిని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. నవంబర్ 1659కి ముందు నుంచి ఉన్న అఫ్జల్ ఖాన్ సమాధిని రక్షించడానికి తగిన ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ సుప్రీంకోర్టును అభ్యర్థించారు.

భారతదేశంలో బీజాపూర్ సుల్తాన్ సామ్రాజ్యం విస్తరణకు దోహదపడ్డారు అఫ్జల్ ఖాన్. ఆదిల్ షాహీ రాజవంశంలో సైన్యాధ్యక్షుడిగా పనిచేశాడు అఫ్జల్ ఖాన్. దక్షిణాదిలో బీజాపూర్ సామ్రాజ్యం విస్తరణ కీలక పాత్ర పోషించాడు. విజయనగర సామ్రాజ్యంలోని చాలా భాగాలపై పట్టు సాధించాడు. చివరకు ఛత్రపతి శివాజీ మహారాజ్ చేతిలో ఓడిపోయి ప్రాణాలు కోల్పోయాడు అఫ్జల్ ఖాన్. ఛత్రపతి శివాజీ ఆదిల్షాహీ సుల్తానేట్ నుంచి తన సొంత సామ్రాజ్యాన్ని ఏర్పచుకున్నారు.