పెగాసస్‌పై నేడు సుప్రీం కోర్టులో విచారణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసిన, పార్లమెంట్ సమవేశాలను కుదిపేస్తోన్న పెగాసస్ వ్యవహారంపై విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం ముందు వాదనలు జరగనున్నాయి.. కేంద్ర మాజీ ఆర్ధిక మంత్రి యశ్వంత్ సిన్హా తో సహా మొత్తం 10 మంది పిటిషనర్లుగా ఉన్నారు.. కాగా, ప్రపంచవ్యాప్తంగా మొత్తం 17 ప్రముఖ మీడియా సంస్థలు సంయుక్త పరిశోధనాత్మక వార్తా కథనాలతో పెగాసస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగు చూసింది.. ఈ వ్యవహారంపై గత గురవారం విచారణ సందర్భంగా పిటిషనర్లను తమ పిటిషన్ కాపీలను ప్రభుత్వానికి అందజేయాలని ధర్మసనం సూచించగా… ఈ రోజు ప్రభుత్వ వాదనలు జరగనున్నాయి.
అయితే, పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వం కొన్నదా? కొంటే ఎవరిని లక్ష్యంగా చేసుకుని ఆ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించింది..!? ఎంత సొమ్మును వెచ్చించింది..!? తదితర ప్రశ్నలతో గత గురువారం సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు పిటిషనర్లు… కేవలం మీడియాలో వచ్చిన వార్తా కథనాల ఆధారంగా పిటిషన్లు దాఖలు చేయడం కాకుండా, మరింత లోతుగా అధ్యయనం చేసే వనరులు, సామర్థ్యం ఉన్న పిటిషనర్లు ఇతరత్రా సమాచారం ఎందుకు చేయలేకపోయారంటూ.. ఈ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది.. క్రిమినల్ కేసును ఎందుకు నమోదు చేయలేదు అంటూ పిటిషనర్లను ప్రశ్నించింది. ఇలాంటి నిఘా చర్యలు వ్యక్తిగత గోప్యత, స్వేఛ్చ, స్వాతంత్ర్యాలకు, గణతంత్ర దేశ సార్వభౌమత్వానికి తీవ్ర ప్రమాదం కలిగించే అవకాశం ఉందని, తక్షణమే దర్యాప్తుకు ఆదేశాలు జారీచేయాలని పిటీషనర్ల తరఫున వాదనలు వినిపించారు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్… మరి ఇవాళ విచారణ ఏ రకంగా సాగుతుందో చూడాలి.
Also Read
- Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
- Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
- Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
తాజావార్తలు
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!