NTV Telugu Site icon

Supreme Court: రేపు మధురాలో కృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా మసీదు వివాదంపై సుప్రీం విచారణ..

Madhura

Madhura

Supreme Court: ఉత్తరప్రదేశ్‌లోని మథురాలో గల శ్రీకృష్ణ జన్మభూమి- షాహీ ఈద్గా మసీదు వివాదంలో మసీదు నిర్వహణ కమిటీ పిటిషన్‌ను సుప్రీంకోర్టు రేపు (జనవరి 15న) విచారించనుంది. ఈ వివాదంపై దాఖలైన 15 కేసులను విచారణకు స్వీకరించొద్దని మసీదు కమిటీ వేసిన పిల్ ను అలహాబాద్‌ హైకోర్టు ఏక సభ్య ధర్మాసనం గత ఆగస్టు 1న తిరస్కరించడంతో కమిటీ సుప్రీం కోర్టుకు వెళ్లింది. మథురాలోని కృష్ణాలయాన్ని ఔరంగజేబ్‌ హయాంలో కూలగొట్టి అక్కడ మసీదు కట్టారని హిందూ సంస్థలు వాదనలు వినిపిస్తున్నాయి. అయోధ్య రామ జన్మభూమి- బాబ్రీ మసీదు గొడవ చెలరేగడంతో 1991లో పార్లమెంట్ ప్రార్థన స్థలాల చట్టం తీసుకొచ్చింది. మన స్వాతంత్య్ర దినమైన 1947 ఆగస్టు 15వ తేదీ వరకు ప్రార్థన స్థలాలకున్న మత స్వభావాన్ని మార్చొద్దని ఆ చట్టంలో పేర్కొన్నారు.

Read Also: Mahakumbh First Amrit Snan: ప్రయాగ్‌రాజ్‌లో నేడు మొదటి ‘అమృత స్నాన్’.. ఘాట్స్ వద్ద లక్షలాది భక్తులు!

ఇక, అయోధ్య రామ జన్మభూమి- బాబ్రీ మసీదు వివాదానికి ప్రత్యేక ప్రార్థన స్థలాల చట్టం నుంచి 1991లో కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. కృష్ణ జన్మభూమి సమీపంలోని మసీదుపై హిందూ సంస్థలు వేసిన పిటిసన్ ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తోందని మసీదు కమిటీ హైకోర్టులో తెలిపింది. దానికి హైకోర్టు సింగిల్‌ బెంచ్ న్యాయమూర్తి 1991నాటి చట్టం మత స్వభావమంటే ఏమిటో స్పష్టంగా చెప్పలేదుని, వివాదాస్పద స్థలంలో మసీదు, ఆలయం పక్కపక్కనే ఉండటం వల్ల ఆ స్థలం మత స్వభావాన్ని నిర్దారించలేమని ఏకసభ్య ధర్మాసనం తీర్మానించింది. అక్కడి కట్టడం మసీదు లేదా ఆలయం అయి ఉండాలి.. కానీ, ఏకకాలంలో రెండూ కాలేదన్నారు.

Show comments