Site icon NTV Telugu

Siddique Kappan Bail Plea: సుప్రీంలో జర్నలిస్ట్ సిద్ధిఖీ బెయిల్ పిటిషన్‌పై సెప్టెంబర్‌ 9న విచారణ

Siddique Kappan Bail Plea

Siddique Kappan Bail Plea

Siddique Kappan Bail Plea: కేరళ జర్నలిస్టు సిద్ధిఖీ కప్పన్‌ బెయిల్ పిటిషన్‌పై సమాధానమివ్వాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి యు.యు.లలిత్. జస్టిస్ ఎస్. రవీంద్ర భట్‌లతో కూడిన ధర్మాసనం సిద్ధిక్ కప్పన్ బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద ఆరోపణలు ఎదుర్కొని రెండేళ్ల జైలు జీవితం గడిపిన కేరళ జర్నలిస్ట్ సిద్ధిక్ కప్పన్ బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను సెప్టెంబర్ 9న తుది పరిష్కరించడానికి సుప్రీంకోర్టు ఆగస్టు 29న జాబితా చేసింది.

Uttarakhand: కుటుంబసభ్యులను హత్యచేసిన పూజారి.. మృతదేహాల వద్ద క్షుద్రపూజలు

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో దళిత యువతిపై సామాహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన రిపోర్టు చేసేందుకు వెళ్తున్న కప్పన్‌ను ఉత్తరప్రదేశ్‌ పోలీసులు అన్యాయంగా అరెస్టు చేసి.. చట్టవిరుద్ధ కార్యాకలాపాల నిరోధక చట్టం (UAPA)తో పాటు పలు అభియోగాలు మోపిన సంగతి విదితమే. కాగా, ఆగస్టు 2న తన బెయిల్‌ను అలహాబాద్‌ హైకోర్టు తిరస్కరించగా.. ఈ ఉత్తర్వును సవాలు చేస్తూ కప్పన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సెప్టెంబర్‌ 5లోగా వివరణనివ్వాలని ప్రధాన న్యాయమూర్తి యుయు లలిత్‌, ఎస్‌.రవీంద్ర భట్‌ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. మీ సమాధానాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటామని, సెప్టెంబర్‌ 9న ఈ కేసును పరిష్కరిస్తామని తెలిపింది. నోటీసులు జారీ చేశామని పేర్కొంటూ.. తదుపరి విచారణను వచ్చే నెల 9కి వాయిదా వేసింది.

Exit mobile version