NTV Telugu Site icon

Arvind Kejriwal: కేజ్రీవాల్ బెయిల్‌పై కీలక పరిణామం.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

Arvind Kejriwal

Arvind Kejriwal

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టైన సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి బెయిల్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేజ్రీవాల్ ఏప్రిల్ 1 నుంచి ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నాడు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌కి మధ్యంతర బెయిల్ పరిశీలించవచ్చని సుప్రీంకోర్టు శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి తెలిపింది. ఈ కేసులో ఈడీ తనను అరెస్ట్ చేసి రిమాండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం విచారిస్తోంది.

Read Also: Tarun : సీక్రెట్ గా మూడు పెళ్లిళ్లు చేసుకున్న హీరో .. అసలు రహస్యం బయటపెట్టిన తల్లి..

ఈ రోజు విచారణ సందర్భంగా కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ధర్మాసనం తెలిపింది. మే 7న మరోసారి దీనిపై విచారణ జరపుతామని చెప్పింది. ‘‘మేము ఓపెన్‌గా ఉండాలి. తద్వారా ఏ పక్షమూ ఆశ్చర్యానికి గురికాకుండా ఉండాలి’’ అని కోర్టు పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచి ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ అధికారిక ఫైళ్లపై సంతకం చేయగలరా లేదా అని కోర్టు ప్రశ్నించింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన సమయం సహా, దానికి సంబంధించిన ప్రశ్నలకు మే 3 వరకు సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు మంగళవారం ఈడీని కోరింది.

ఏప్రిల్ 9న ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్ అరెస్టు చట్టవిరుద్ధంగా ఏం లేదని తేల్చి చెప్పింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 21న ఈడీ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేసింది. మే 7 వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉండనున్నారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి కేజ్రీవాల్ అని ఈడీ ఆరోపిస్తోంది. ఈ స్కామ్‌లో వచ్చిన డబ్బును ఆప్ గోవా ఎన్నికల్లో ఖర్చు చేసినట్లు ఈడీ పేర్కొంది.