Supreme Court: ‘‘ప్రజల్ని చంద్రుడి పైకి తరలించాలా? మరెక్కడికైనా పంపాలా?’’ అంటూ సుప్రీంకోర్టు శుక్రవారం పిటిషనర్‌పై ఫైర్ అయింది. భారతదేశ జనాభాలో 75 శాతం మంది భూకంపాల జోన్‌లోనే ఉన్నారని, భూకంపాల వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడానికి అధికారులు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేస్తూ అత్యున్నత న్యాయస్థానం, ఈ వ్యాఖ్యలు చేసింది.
Read Also: India-China: చైనా బిజినెస్ వీసాల వేగం పెంచిన భారత్.. కారణాలు ఇవే..
ఈ కేసును జస్టిన్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ముందు వినిపించేందుకు పిటిషన్ స్వయంగా హాజరయ్యారు. గతంలో ఢిల్లీ మాత్రమే అధిక భూకంప జోన్ భాగంలో ఉండేదని, కానీ ఇటీవల భారత్ జనాభాలో 75 శాతం మంది ఈ జోన్ లో ఉన్నారని తెలిపారు. దీనికి ప్రతిగా ‘‘అయితే మనం అందర్ని చంద్రుడిపైకి లేదా మరెక్కడికైనా తరలించాలా?’’ అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. ఇటీవల జపాన్ లో పెద్ద భూకంపం వచ్చిందని పిటిషనర్ చెప్పారు. ‘‘మనం ముందుగా ఈ దేశంలోకి అగ్నిపర్వతాలు తీసుకురావాలి, అప్పుడు మనం భారత్‌ను జపాన్‌తో పోల్చవచ్చు’’ అని ధర్మాసనం పేర్కొంది.
భూకంపం సంభవించినప్పుడు నష్టాన్ని తగ్గించడానికి అధికారులు ఏర్పాట్లు చేయాలని పిటిషనర్ కోరాడు. దీనికి ప్రతిగా అది ప్రభుత్వం చూసుకోవాల్సిన విషయమని, ఈ కోర్టు దీనిని చేయలేదని, పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం చెప్పింది.
